బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ పెద్దగా అంచనాలు ఏమి లేకుండా రిలీజ్ అయ్యి ఊహకందని వసూళ్లతో సంక్రాంతికి సెన్సేషనల్ రికార్డులను సృష్టించిన యంగ్ హీరో తేజ సజ్జ(Teja Sajja) తర్వాత చాలానే ఆఫర్స్ రాగా వాటిలో బాగా ఎక్సైట్ చేసిన మిరాయ్(Mirai Movie) తో ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో…
రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద డీసెంట్ లెవల్ లో అంచనాలు ఏర్పడగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేయగా టీసర్ ఇన్ స్టంట్ గా అందరి అంచనాలను ఓ రేంజ్ లో మించి పోయింది అని చెప్పాలి ఇప్పుడు…
టీసర్ చూసిన తర్వాత అందరిలో కూడా వచ్చిన పెద్ద డౌట్ అసలు ఎంత బడ్జెట్ తో సినిమాను నిర్మించారు అని అనుకోగా….ఓవరాల్ గా సినిమా అన్ని ఖర్చులతో కలిపి ఓవరాల్ గా 60 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో నిర్మించారని తెలుస్తుంది….
ఇంత తక్కువ బడ్జెట్ ఆ రేంజ్ లో సాలిడ్ విజువల్స్ తో మెప్పించడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి…..హనుమాన్ మూవీ కూడా కేవలం 45 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తోనే నిర్మాణం అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో ఏకంగా….
296 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో మాస్ ఊచకోత కోసింది….ఆ సినిమా తో పోల్చితే ఈ సినిమా కూడా విజువల్స్ పరంగా మరో లెవల్ లో మెప్పించేలా ఉండగా టీసర్ క్లైమాక్స్ లో రాముడు నడుచుకుంటూ..వచ్చినట్లు చూపించిన షాట్ తో…
సినిమా మీద అంచనాలు మరో లెవల్ కి వెళ్ళిపోయాయి అని చెప్పాలి. టీసర్ రేంజ్ లోనే సినిమా కూడా రిలీజ్ అయ్యాక మెప్పిస్తే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి తేజ సజ్జ మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…..