తర్వాత సమ్మర్ లో వచ్చిన మజిలీ కి కూడా 2.75 రేటింగ్ యావరేజ్ గా ఇచ్చినా సినిమా దుమ్ము లేపుతూ ఏకంగా 40.23 కోట్ల షేర్ ని అందుకుంది, ఇక డబ్ మూవీస్ లో కాంచన 3 కి కేవలం 2.25 నుండి 2.5 స్టార్ రేటింగ్ ఇచ్చినా ఆడియన్స్ మెప్పుతో ఆల్ మోస్ట్ 20 కోట్ల షేర్ ని అందుకుంది.
ఇక రీసెంట్ గా వచ్చిన మహేష్ మహర్షి కి 2.5 టు 2.75 రేటింగ్ ఇచ్చినా ఆడియన్స్ మెప్పు తో ఏకంగా 100 కోట్ల షేర్ పైపు అడుగులు వేస్తూ దుమ్ము లేపింది. మొత్తం మీద తెలుగు ఆడియన్స్ మనసులు మారుతున్నాయి అని చెప్పాలి. రివ్యూ లను పట్టించుకోకుండా తమ కి నచ్చితే ఇతరులకు చెబుతూ సినిమాలను ఆదరిస్తున్నారు. ఇది కచ్చితంగా మంచి పరిణామం గా చెప్పుకోవచ్చు.