Home న్యూస్ బిగ్ బాస్ హోస్టుల రెమ్యునరేషన్ వివరాలు ఇవే!!

బిగ్ బాస్ హోస్టుల రెమ్యునరేషన్ వివరాలు ఇవే!!

1428
0

బిగ్ బాస్… ఇండియా అంతా చాలా పాపులర్ అయిన ఈ రియాలిటీ షో తెలుగు లో సక్సెస్ అవుతుందా లేదా అన్న డౌట్ అందరిలోనూ ఉండేది, కానీ అందరికీ షాక్ ఇస్తూ ఫస్ట్ సీజన్ సూపర్ సక్సెస్ గా నిలవగా రెండో సీజన్ కాంట్రవర్సీలకు నిలవుగా నిలిచినా ఒక్క వ్యక్తీ వలన సూపర్ సక్సెస్ అయింది. ఇక మూడో సీజన్ TRP రేటింగ్ లు రికార్డులు క్రియేట్ చేసినా రెండో సీజన్ అంత కిక్ అయితే ఇవ్వలేదు.

కానీ ఈ మూడు సీజన్స్ లో హోస్ట్ గా చేసిన మన హీరోలు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇప్పుడు నాలుగో సీజన్ మొదలు కానుండగా ఇప్పుడు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అన్నది ఆసక్తిగా మారగా… టాలీవుడ్ లో బిగ్ బాస్ హోస్టులపై అనేక రూమర్స్ ఉండగా…

ఉన్నంతలో అటూ ఇటూగా నిజం అని నమ్మేలా ఉన్న రెమ్యునరేషన్ వివరాలను తెలియజేస్తున్నాం. ముందుగా మొదటి సీజన్ కి గాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కో ఎపిసోడ్ హోస్ట్ చేసినందుకు అక్షరాలా 35 లక్షల రెమ్యునరేషన్ ని అందుకునేవాడని సమాచారం. ఇక మొదటి సీజన్ సూపర్ సక్సెస్ తర్వాత..

ఎన్టీఆర్ రెండో సీజన్ నుండి సినిమాల వలన తప్పుకున్నాడు… కాగా రెండో సీజన్ కి నాని హోస్ట్ చేయగా ఒక్కో ఎపిసోడ్ కి 10 నుండి 12 లక్షల రేంజ్ లో రెమ్యునరేషన్ ని అందుకున్నాడని సమాచారం. కానీ రెండో సీజన్ కాంట్రవర్సీలకు నిలవు అవ్వడంతో ఇక వద్దు అనుకుని నాని మూడో సీజన్ కి నో చెప్పాడు. ఇక మూడో సీజన్ ని…

హోస్ట్ చేసిన నాగార్జున కూడా 10 నుండి 12 లక్షల రేంజ్ లో రెమ్యునరేషన్ ని తీసుకున్నాడని సమాచారం. ఇక ఇప్పుడు నాలుగో సీజన్ కూడా హోస్ట్ చేయబోతున్న నాగార్జున ఈ సారి ఒక్కో షో కి 12 లక్షల నుండి 14 లక్షల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారని అంటున్నారు. త్వరలోనే సీజన్ 4 మొదలు అవ్వడానికి సిద్ధం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here