ప్రతీ ఏడాది ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినా కానీ అందులో కొన్ని సినిమాలు అంచనాలను మించి ఆ ఇయర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపడం మనం చూశాం, అలాగే ప్రతీ నెలలో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న టాప్ మూవీస్ ఏవి ఉన్నాయి, తెలుగు సినిమా లలో జనవరి నుండి డిసెంబర్ వరకు రిలీజ్ అయిన సినిమాలలో ప్రతీ నెలలో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా లను ఒకసారి గమనిస్తే…
జనవరి నెలలో “అల వైకుంఠ పురంలో” హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలవగా, ఇక ఫిబ్రవరి నెలలో ఈ ఇయర్ మొదట్లో వచ్చిన “ఉప్పెన” హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది, ఇక మార్చి నెలలో “రంగస్థలం” సినిమా హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలవగా….
ఏప్రిల్ నెలకి వచ్చే సరికి ఎపిక్ “బాహుబలి 2” సినిమా హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా చరిత్రకెక్కింది. ఇక మే నెలకి వచ్చేసరికి “మహర్షి” సినిమా హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలవగా, జూన్ నెలలో “దువ్వాడ జగన్నాథం” సినిమా హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది.
ఇక జులై నెలకి వచ్చే సరికి “బాహుబలి 1” సినిమా హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలవగా, ఆగస్టు నెలలో “సాహో” సినిమా చరిత్ర సృష్టించింది, ఇక సెప్టెంబర్లో “జనతా గ్యారేజ్” సినిమా హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలవగా, అక్టోబర్ లో “సైరా నరసింహా రెడ్డి” టాప్ లో ఉంది. ఇక నవంబర్ లో “డమరుకం” సినిమా ఇప్పటికీ టాప్ లో ఉండగా డిసెంబర్ లో “ధృవ” టాప్ ప్లేస్ ని సొంతం చేసుకుంది.
వీటిలో ఈ ఇయర్ కొన్ని నెలల రికార్డులు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది సెకెండ్ వేవ్ రాకుండా ఉండి ఉంటే ఈ పాటికే ఈ లిస్టులో మార్పులు చేర్పులు మరిన్ని జరిగి ఉండేవి కానీ సెకెండ్ వలన సినిమాలు ఆగిపోయిన నేపధ్యంలో సెకెండ్ ఆఫ్ ఎండ్ టైం సమయానికి కచ్చితంగా కొన్ని మార్పులు జరగోచ్చు. ఇక వచ్చే ఏడాది మాత్ర్రం కుప్పలు తెప్పలుగా సినిమాలు ఉన్న నేపధ్యంలో కొత్త సినిమాలు లిస్టులో చోటు దక్కించుకోవచ్చు.