Home న్యూస్ 87 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో మొదటి 25 కోట్ల బిజినెస్ సినిమా ఇదే!

87 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో మొదటి 25 కోట్ల బిజినెస్ సినిమా ఇదే!

706
8

     తెలుగు సినిమా రోజురోజుకి ముందుకు వెళుతుంది… ఒకప్పుడు 30 కోట్లు-40 కోట్ల కలెక్షన్లే గొప్ప అనుకుంటున్న సమయంలో మగధీర తర్వాత తెలుగు సినిమా స్థాయి 75 కోట్ల క్లబ్ లో చేరగా తర్వాత బాహుబలి రాకతో 100 కోట్ల పైకి చేరుకుంది. కానీ టాలీవుడ్ హిస్టరీలో ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కూడా ఈ లెక్కలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండగా తొలి 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించిన సినిమా ఏది అన్న ఆసక్తికరమైన ప్రశ్న మా T2B Q&A లో ఒకరు అడిగారు…

మాకు తెలినంతవరకు శోధించి ఆ సినిమా ఎదో గెస్ చేస్తున్నాం.ఇండస్ట్రీ లెక్కల ప్రకారం పవ కళ్యాణ్ నటించిన జానీ తొలి 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీ అని అంటున్నారు. తర్వాత ఎన్టీఆర్ ఆంధ్రావాళ 23 కోట్ల బిజినెస్ చేసినట్లు అంచనా…

కాగా ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్లు కొట్టిన ఖుషి, సింహాద్రి సినిమాల తర్వాత రావడంతో భారీ అంచనాల నడుమ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగిందని అంటున్నారు.కానీ రెండు ఫ్లాఫ్ అవ్వడంతో కొన్నాళ్ళు 25 కోట్ల ప్రీ రిలీజ్ కి ఎవ్వరూ

సిద్ధపడలేదని మళ్ళీ యమదొంగ సమయం నుండి 25 కోట్లకు పైగా బిజినెస్ మొదలైందని చెబుతున్నారు. ఇక ఇప్పుడు మార్కెట్ భారీ గా పెరిగి 100 కోట్ల రేంజ్ లో కూడా బిజినెస్ చేస్తున్న సినిమాలు ఉన్నాయి, రీసెంట్ టైం లో బాహుబలి సిరీస్, స్పైడర్, అజ్ఞాతవాసి

భరత్ అనే నేను లాంటి సినిమాలు 100 కోట్ల బిజినెస్ ని అందుకున్నాయి. మీ దగ్గర ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్న ఏదైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here