టాలీవుడ్ కి రెండు తెలుగు రాష్ట్రాల ఆవల కర్ణాటక అండ్ ఓవర్సీస్ బిగ్గెస్ట్ మార్కెట్ ఉన్న ఏరియాలు అని చెప్పాలి. ముఖ్యంగా పక్క రాష్ట్రం అయిన కర్ణాటక లో మన హీరోల సినిమాలకు సాలిడ్ కలెక్షన్స్ ఎప్పుడూ వస్తూ ఉంటాయి, స్టార్ హీరోల సినిమాలకు హైర్స్ కూడా ఈ మధ్య యాడ్ అవుతూ ఉండటం తో చాలా సినిమాలకు అవి లాంగ్ రన్ లో కూడా భారీగా ఉపయోగ పడుతున్నాయి. ఇక ఇక్కడ ఇప్పటి వరకు…
రిలీజ్ అయిన సినిమాల్లో టాప్ 10 మూవీస్ షేర్స్ ని గమనిస్తే… ముందుగా బాహుబలి సిరీస్ ని గమనిస్తే బాహుబలి మొదటి పార్ట్ ఇక్కడ 2015 లో 38 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా 2017 లో వచ్చిన బాహుబలి పార్ట్ 2 సినిమా 52 కోట్ల షేర్ ని వసూల్ చేసింది.
ఇక మిగిలిన సినిమాల్లో రీసెంట్ గా 2 పాన్ ఇండియా మూవీస్ అక్కడ రిలీజ్ అయ్యాయి. వాటి కలెక్షన్స్ ని కూడా గమనిస్తే ముందు రిలీజ్ అయిన ప్రభాస్ సాహో సినిమా 16.15 కోట్ల షేర్ తో ముందు నాన్ బాహుబలి రికార్డ్ కొట్టగా తర్వాత వచ్చిన చిరంజీవి నటించిన పాన్ ఇండియా మూవీ…
సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర కర్ణాటక లో 16.52 కోట్ల షేర్ ని వసూల్ చేసి నాన్ బాహుబలి మూవీస్ లో రికార్డ్ కొట్టింది. అలాగే పాన్ ఇండియా మూవీస్ లో కూడా నాన్ బాహుబలి రికార్డ్ హోల్డర్ గా ఉంది. ఇక మిగిలిన నార్మల్ మూవీస్ లో అక్కడ టాప్ 10 మూవీస్ లిస్టు ను గమనిస్తే….
10. సరిలేరు నీకెవ్వరు
ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన మహేష్ సరిలేరు నీకెవ్వరు భారీ పోటి వలన కొద్దిగా ఇబ్బంది పడ్డా సూపర్ స్టార్ క్రేజ్ పవర్ తో టోటల్ రన్ లో ఇక్కడ 7.52 కోట్ల షేర్ ని వసూల్ చేసింది. పోటి లేకుండా ఉంటే కలెక్షన్స్ మరింత ఎక్కువ ఉండేవి అని చెప్పొచ్చు.
9. మగధీర
2009 లో వచ్చిన మగధీర కలెక్షన్స్ పై ఫుల్ క్లారిటీ అయితే లేదు… కొందరు 5 కోట్ల మేర కలెక్షన్స్ ని అందుకుందని అనే వారు ఉన్నారు కానీ అప్పటి ట్రేడ్ అనలిస్టులలో ఎక్కువ మంది సినిమా ఫైనల్ రన్ లో 8.05 కోట్లు వసూల్ చేసిందని చెప్పారు. అదే వెబ్ సైట్స్ లో కూడా పబ్లిష్ చేశారు.
8. భరత్ అనే నేను2018 లో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సమ్మర్ రేసులో సాలిడ్ కలెక్షన్స్ తో ఊచకోత కోయగా కన్నడ లో కూడా అద్బుతంగా హోల్డ్ చేసిన ఈ సినిమా ఫైనల్ రన్ పూర్తీ అయ్యే టైం కి 8.35 కోట్ల షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర వసూల్ చేసి దుమ్ము లేపింది.
7. జనతా గ్యారేజ్
2016 లో ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ మిక్సుడ్ టాక్ తోనే ఓపెన్ అయినా తర్వాత పాజిటివ్ గా మారి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ ని అందుకోగా కర్ణాటక లో కూడా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో 8.4 కోట్ల షేర్ ని వసూల్ చేసి రికార్డ్ కొట్టింది అప్పట్లో…
6. మహర్షి
2019 లో మహేష్ బాబు కెరీర్ లో 25 వ సినిమా గా తెరకెక్కిన మహర్షి కూడా మిక్సుడ్ టాక్ తోనే రిలీజ్ అయిన సమ్మర్ లో అద్బుతమైన రన్ ని కొనసాగించి బాక్స్ ఆఫీస్ దగ్గర మహేష్ కెరీర్ లో నంబర్ 1 మూవీగా నిలవడమే కాకుండా కర్ణాటకలో 8.72 కోట్ల షేర్ ని అందుకుంది.
5. జై లవ కుశ
2017 లో వచ్చిన ఎన్టీఆర్ జై లవ కుశ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక వారానికే మహేష్ స్పైడర్ నుండి పోటి ఎదురుకున్నా పోటిలో విన్నర్ గా నిలిచి కర్ణాటక లో కూడా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని అందుకుని ఫైనల్ రన్ లో 8.92 కోట్ల షేర్ ని వసూల్ చేసి దుమ్ము లేపే రికార్డ్ ను నమోదు చేసింది.
4. ఖైదీ నంబర్ 150
మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 2017 సంక్రాంతి కి బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలవగా కన్నడలో కూడా సినిమా ఫైనల్ రన్ లో 9.11 కోట్ల షేర్ ని వసూల్ చేసి అక్కడ కూడా నాన్ బాహుబలి రికార్డ్ కొట్టింది.
3. రంగస్థలం
2018 లో రామ్ చరణ్ నటించిన రంగస్థలం బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోసే కలెక్షన్స్ తో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసి చరిత్ర సృష్టించగా కర్ణాటక లో కూడా 9.21 కోట్ల షేర్ తో పాత రికార్డులు బ్రేక్ చేసి నాన్ బాహుబలి రికార్డ్ హోల్డర్ గా అక్కడ కూడా సంచలనం సృష్టించింది.
2. అల వైకుంఠ పురంలో
ఈ ఇయర్ సంక్రాంతి కి వచ్చిన అల్లు అర్జున్ అల వైకుంఠ పురంలో కొన్ని సార్లు నాన్ బాహుబలి రికార్డులే కాదు ఏకంగా బాహుబలి రికార్డులు కూడా బ్రేక్ చేసింది. కర్ణాటక లో భారీ పోటి వలన కొత్త రికార్డులు మిస్ అయ్యాయి కానీ సోలో గా వచ్చి ఉంటే ఈ సినిమా ఇక్కడ కూడా మరిన్ని రికార్డులు నమోదు చేసేది, ఫైనల్ రన్ లో 9.24 కోట్ల షేర్ తో దుమ్ము లేపింది.
1. అరవింద సమేత
ఇక 2018 లో ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా రేసులో అల్టిమేట్ కలెక్షన్స్ తో ఊచకోత కోయగా కన్నడలో కూడా రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో 10 కోట్ల మార్క్ ని అందుకున్న మొదటి నాన్ బాహుబలి మూవీ గా నిలిచింది. ఫైనల్ రన్ లో 10.2 కోట్ల షేర్ తో నాన్ బాహుబలి రికార్డ్ కొట్టగా నార్మల్ మూవీస్ లో ఇప్పటికీ ఇది రికార్డ్ అనే చెప్పాలి.
ఇవీ మొత్తం మీద కర్ణాటక ఏరియాలో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని అందుకున్న టాప్ నార్మల్, పాన్ ఇండియా అండ్ బాహుబలి మూవీస్, ఈ ఇయర్ కొన్ని సినిమాలు మాత్రమె రిలీజ్ అయ్యే అవకాశం ఉండగా వచ్చే ఇయర్ భారీ లెక్కలో సినిమా వస్తాయి కాబట్టి ఈ లిస్టులో కచ్చితంగా మార్పులు ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.