Home న్యూస్ తెలుగు సినిమా స్టార్ హీరోస్ ఒక్క సినిమాకి తీసుకునే రెమ్యునరేషన్ డీటైల్స్ ఇవే!

తెలుగు సినిమా స్టార్ హీరోస్ ఒక్క సినిమాకి తీసుకునే రెమ్యునరేషన్ డీటైల్స్ ఇవే!

2

తెలుగు సినిమా అభిమానులు సామాన్య సినీ ప్రేక్షకులను తమ హీరోలు అలాగే ఇతర హీరోలు ఇండస్ట్రీలో ఎంతెంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో అనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది…హీరోలు ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అని బయట వినిపిస్తున్నా అది ఎంతవరకు నిజమో తెలియదు.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోలలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలు ఎవరెవరో వైల్డ్ గెస్ చేద్దాం పదండి…ఈ హీరోలు ఇంతవరకు తీసుకునే చాన్స్ ఉందని చెబుతున్నాం…అఫీషియల్ గా ఎంత తీసుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి.

Nellore Area All Time Top 10 Share Movies

ఇక ఇక్కడ గమనించాల్సిన మరో విషయం, కొంత మంది హీరోలు సినిమాలకు రెమ్యునరేషన్ డబ్బులు తీసుకోవడానికి బదులుగా ఆ సినిమాల శాటిలైట్, డిజిటల్ రైట్స్ ని, లేదా ఏరియాల వారి రైట్స్ ని రెమ్యునరేషన్ కింద తీసుకుంటారు, లేదా సినిమా కి కొంత అమౌంట్ ని తీసుకుని….

Guntur Area All Time Top 10 Share Movies

తర్వాత వచ్చిన ప్రాఫిట్ లో షేర్ తీసుకుంటారు, మహేష్ బాబు నిర్మాణంలో కూడా ఉంటాడు కాబట్టి రెమ్యునరేషన్ బదులు టోటల్ ప్రాఫిట్ షేర్ తీసుకుంటాడు, ఇక చిరు ఓన్ ప్రొడక్షన్ లోనే చేస్తున్నాడు కాబట్టి ఎంత రెమ్యునరేషన్ అన్నది క్లియర్ గా చెప్పలేం… ఇక పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్ షేర్ కూడా తీసుకుంటూ ఉండగా…

West All Time Top 10 Share Movies

ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లు ఇప్పటి వరకు కేవలం రెమ్యునరేషన్ ని మాత్రమె తీసుకుంటూ వచ్చారు, తర్వాత సినిమాల నుండి ప్రాఫిట్ షేర్ కూడా వెళుతుందని చెప్పొచ్చు. ఇక ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అవ్వడం తో రెమ్యునరేషన్ భారీ లెవల్ లో తీసుకోవడమే కాకుండా ప్రాఫిట్ షేర్ కూడా భారీ లేవ్వాల్ లో ఉంటుందని సమాచారం.

ఒక సారి మన హీరోల కేవలం నిర్మాతలు ఇచ్చే రెమ్యునరేషన్ రేట్లు మాత్రమే చూసుకుంటే…
చిరంజీవి—2017 నుండి 40 కోట్లు+++
బాలకృష్ణ—-2022 నుండి 15 కోట్లు+++
వెంకటేష్—-10 కోట్లు
నాగార్జున—6 కోట్లు
ప్రభాస్—బాహుబలి కి ముందు 8 కోట్లు—బాహుబలి తర్వాత 120 కోట్లు+++
పవన్ కళ్యాణ్—–55 కోట్లు+++
మహేష్—–50 కోట్లు ++++
ఎన్టీఆర్—-35 కోట్లు(RRR)+++
అల్లుఅర్జున్—–35 కోట్లు(పుష్ప)
రామ్ చరణ్—-35 కోట్లు(RRR)
రవితేజ—-15 కోట్లు
నాని —-12 కోట్లు
విజయ్ దేవరకొండ —–12 కోట్లు+
నాగ చైతన్య —— 8 కోట్లు
రామ్——7 కోట్లు
అఖిల్—–5-6 కోట్లు
నితిన్—–4 కోట్లు
సాయి ధరం తేజ్ – 4 కోట్లు
వరుణ్ తేజ్ – 4 కోట్లు

East All Time Top 10 Share Movies

ఇవన్నీ మన హీరోలు నటించి రిలీజ్ అయిన రీసెంట్ మూవీస్ రెమ్యునరేషన్ లెక్కలు…ప్రాఫిట్ షేర్ లెక్కలు ఎవ్వరూ పెద్దగా రివీల్ చేయరు కాబట్టి అవి ఎంత అనేది వాళ్ళకే క్లియర్ గా తెలుస్తాయని చెప్పొచ్చు. మిగిలిన హీరోల్లో ఎక్కువ శాతం 4 కోట్లకంటే తక్కువే తీసుకుంటున్నారు.

సినిమా సినిమా కి రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్న మన హీరోలు హిట్లకు ఫ్లాఫ్స్ కి అతీతంగా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతూ దూసుకు పోతున్నారు. లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ లో భారీ ఎదురుదెబ్బలు పడ్డాయి కానీ త్వరలోనే టాలీవుడ్ తిరిగి కోలుకుని వరుస పెట్టి విజయాలతో దుమ్ము లేపడం ఖాయమని చెప్పొచ్చు.

Krishna Area All Time Top 10 Share Movies

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here