టెంపర్ రీమేక్ “అయోగ్య” టీసర్…కుమ్మేశాడు కానీ!!

1
901

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైం బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాలలో ఒకటిగా నిలిచిన టెంపర్ సినిమా ఇప్పుడు ఇతర భాషల్లో రీమేక్ అవుతూ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే, రీసెంట్ గా సినిమా హిందీ లో సింబా పేరు తో రీమేక్ అవ్వగా అక్కడ అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు తమిళ్ లో విశాల్ హీరోగా ఈ సినిమాను రీమేక్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ని రిలీజ్ చేశారు. టీసర్ లో ఆల్ మోస్ట్ టెంపర్ కంటెంట్ నే మక్కీ కి మక్కీ తెరకెక్కించినట్లు క్లియర్ గా తెలుస్తుంది, దేశం లో జరుగుతున్న ప్రతీ అవినీతి కి ముందు సాక్షి గాంధీజీ నే అంటూ టీసర్ మొదలు అవుతుంది. తర్వాత ఆల్ మోస్ట్…

టెంపర్ సీన్స్ నే మళ్ళీ చూస్తున్నాం అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అండ్ షాట్స్ బాగున్నా… మళ్ళీ ఒరిజినల్ లో ఎన్టీఆర్ ఎలా చేశాడు అన్నది గుర్తు కి వస్తే మాత్రం జస్ట్ ఓకే అనిపించే విధంగా ఈ టీసర్ ఓవరాల్ గా ఉంది అనిపించడం ఖాయం.

కానీ సినిమాలో చాలా మార్పులు చేర్పులు చేశామని విశాల్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో లో క్లియర్ గా తెలియజేశాడు. సినిమా ను తెలుగు లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయొచ్చని… కథ లో పాయింట్ ని మేం చాలా వరకు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాం అన్నాడు.

మరి టీసర్ లో మాత్రం షాట్స్ పరంగా టెంపర్ నే సీన్ టు సీన్ దింపేశాడని అర్ధం అవుతుంది, బహుశా ఇది టీసర్ అవ్వడం తో ముందు ఇలా హైప్ తెచ్చి ట్రైలర్ లో మరిన్ని హంగులను చూపెడతారు కాబోలు. మొత్తం మీద టీసర్ బాగుంది కానీ టెంపర్ తో కంపేర్ చేస్తే యావరేజ్ అనిపించింది… మరి మీరేమంటారు???…. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!