Home న్యూస్ టెంపర్ రీమేక్…అయోగ్య కలెక్షన్స్…దిమ్మతిరిగే షాక్ ఇది!!

టెంపర్ రీమేక్…అయోగ్య కలెక్షన్స్…దిమ్మతిరిగే షాక్ ఇది!!

1656
0

  వరుస పరజాయాల్లో ఉన్న సమయం లో టెంపర్ తో అల్టిమేట్ కంబ్యాక్ ఇచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సినిమా లో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ కి ఓ రేంజ్ లో అప్లాజ్ కూడా వచ్చింది. ఆ తర్వాత కెరీర్ లో ఇప్పటి వరకు ఫ్లాఫ్ అంటే తెలియకుండా కెరీర్ ని కొనసాగిస్తున్నాడు ఎన్టీఆర్. అలాంటి సినిమాను రీసెంట్ గా తమిళ్ లో విశాల్ అయోగ్య పేరు తో రీమేక్ చేశాడు. మరీ ఎన్టీఆర్ లెవల్ లో కాకున్నా…

ఉన్నంతలో మంచి పెర్ఫార్మెన్స్ నే ఇచ్చినా ఎందుకనో అక్కడ ఆడియన్స్ సినిమా ను హిట్ చేయలేదు. సినిమా మొత్తం మీద అక్కడ 6 రోజుల్లో కేవలం 8.75 కోట్ల గ్రాస్ ని మాత్రమె కలెక్ట్ చేసింది. కేరళ, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి మరో 1.5 కోట్ల గ్రాస్ రాగా…

టోటల్ గా ఇప్పటి వరకు 10.15 కోట్ల గ్రాస్ ని 5.5 కోట్ల షేర్ ని సినిమా సాధించిందట. సినిమాను టోటల్ గా 22 కోట్లకు అమ్మగా సినిమా రిజల్ట్ చూసి ఇప్పుడు అందరు షాక్ అవుతున్నారు. రివ్యూ లు బాగానే వచ్చినా సినిమా ఫెయిల్ అవ్వడానికి రీజన్ తెలియక తికమక పడుతున్నారు. ఫైనల్ రన్ లో కూడా భారీ నష్టాలు ఖాయమని అంటుండటం విచార కరం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here