టెంపర్ Vs అయోగ్య….ఇక్కడే తేలిపోయాడు

   రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు కావస్తున్నా ఇప్పటికీ వార్తల్లో నిలుస్తున్న సినిమా టెంపర్. రిలీజ్ అయిన 3 ఏళ్ల తర్వాత ఈ సినిమా హిందీ లో రీమేక్ అయ్యి ఘన విజయాన్ని సొంతమ్ చేసుకుంది. ఇక సినిమా రీసెంట్ గా తమిళ్ లో విశాల్ హీరోగా అయోగ్య పేరుతొ రీమేక్ అవ్వగా అందరు ఈ సినిమాను ఒరిజినల్ టెంపర్ తో కంపేర్ చేయడం మొదలు పెట్టారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన…

సినిమాల్లో ముందు నిలిచే సినిమా గా చెప్పుకునే సినిమా టెంపర్. ఇందులో ఎన్టీఆర్ యాక్టింగ్ కానీ మ్యానరిజమ్స్ కానీ నెగటివ్ క్యారెక్టర్ కానీ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకోగా తర్వాత ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు చేసినా ఈ సినిమా ఇంపాక్ట్ తగ్గదని పూరి చేసిన కామెంట్స్…

ఇప్పటికీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది, అలాంటి ఇంపాక్ట్ ని కలగజేసిన టెంపర్ ని రీమేక్ చేయడానికి ఎవ్వరూ సాహసించలేదు. ఇలా మూడేళ్ళు గడిచిన తర్వాత బాలీవుడ్ లో యాక్షన్ డైరెక్టర్ రోహిత్ శెట్టి మెయిన్ పాయింట్ ని మాత్రమె తీసుకుని ఎన్టీఆర్ కంపారిజన్…

రాకుండా అనేక సీన్స్ ని మార్చాడు. ఇక రీసెంట్ గా విశాల్ టెంపర్ రీమేక్ అయోగ్య టీసర్ రిలీజ్ అవ్వగా అందరు విశాల్ ని మెచ్చుకుంటూనే కొన్ని షాట్స్ పూర్తిగా టెంపర్ లోనివే దింపాడని అంటున్నారు. నటుడిగా తానెంతో వాడు వీడు సినిమాతోనే నిరూపించుకున్న విశాల్..

టెంపర్ రీమేక్ టీసర్ చాలా వరకు మెప్పించినా టెంపర్ లో బీచ్ ఫైట్ లో ఎన్టీఆర్ ఇచ్చే ఇంప్రెషన్ ని మరిపించడంలో దొరికిపోయాడు. అక్కడ ఎన్టీఆర్ తో కంపెరిజన్స్ మొదలవ్వడంతో విశాల్ తేలిపోయాడు అని అందరు అనడం మొదలు పెట్టారు. కానీ సినిమా పరంగా విశాల్ కెరీర్ బెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలుస్తుందని ప్రతీ ఒక్కరు చెబుతుండటం విశేషం.. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Related Articles

Post A Comment

avatar
  Subscribe  
Notify of

SHARE THIS ARTICLE

Facebook
Twitter

SEARCH THIS SITE

SHARE THIS ARTICLE