మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే మన దగ్గర టాప్ స్టార్స్ ఎక్కువ ఉండగా ఒకప్పటిలా క్రమం తప్పకుండా అందరూ సినిమాలు చేయడం లేదు….పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళడంతో సినిమాలు ఆలస్యం అవుతూ ఉండగా…ఎట్టకేలకు పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండగా మిగిలిన టాప్ 5 హీరోల సోలో సినిమాలు ఏడాది గ్యాప్ లో ఆడియన్స్ ముందుకు వచ్చాయి….
మరి ఈ సినిమాలతో మొదటి రోజు ఏ హీరో ఎలాంటి ఓపెనింగ్స్ ను అందుకున్నాడో తెలుసుకుందాం పదండీ…. ముందుగా లాస్ట్ ఇయర్ సంక్రాంతికి మహేష్ బాబు నటించిన గుంటూరు కారం రీజనల్ మూవీ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా మొదటి రోజున…
52.03 కోట్ల రేంజ్ లో షేర్ ని 79.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని కుమ్మేశాడు…టాక్ వలన లాంగ్ రన్ అనుకున్న రేంజ్ లో రాలేదు…ఇక తర్వాత ఇయర్ మిడిల్ లో ప్రభాస్ నటించిన కల్కి 2898 AD మూవీతో యునానిమస్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోగా మొదటి రోజున…
ఏకంగా 96.16 కోట్ల రేంజ్ లో షేర్ ని 183.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపాడు…లాంగ్ రన్ లో 1000 కోట్లతో ఊహకందని ఊచకోత కోశాడు ప్రభాస్…. ఇక తర్వాత సెప్టెంబర్లో లో 6 ఏళ్ల గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ దేవర సోలో మూవీతో వచ్చి ఎక్స్ ట్రీమ్ నెగటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా..
మొదటి రోజు 98.60 కోట్ల షేర్ ని 157 కోట్ల రేంజ్ లో మమ్మోత్ గ్రాస్ ను అందుకుని ఊచకోత కోశాడు…మిక్సుడ్ టాక్ తో లాంగ్ రన్ లో బ్లాక్ బస్టర్ కొట్టి 450 కోట్లు సాధించాడు. ఇక్కడ కల్కికి దేవర కి షేర్ అండ్ గ్రాస్ లో తేడా ఏంటి అని డౌట్ రావొచ్చు…..కల్కికి హిందీ లో ఓవర్సీస్ లో ఎక్కువ వసూళ్లు రావడంతో..గ్రాస్ ఎక్కువ వచ్చింది…
అదే టైంలో దేవరకి తెలుగు రాష్ట్రాల్లో షేర్ ఎక్కువ రావడంతో షేర్ పరంగా దేవర గ్రాస్ పరంగా కల్కికి ఎక్కువ ఎడ్జ్ వచ్చింది…ఇక ఇయర్ ఎండ్ లో ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప2 తో అల్లు అర్జున్ అన్ని రికార్డుల బెండు తీసి బిగ్గెస్ట్ డే1 రికార్డ్ కొట్టాడు…ఏకంగా 285.55 కోట్ల గ్రాస్ ను 160 కోట్ల రేంజ్ లో షేర్ తో….
ఎపిక్ రికార్డుల భీభత్సం సృష్టించి కెరీర్ లో అలాగే ఇండస్ట్రీ లో రికార్డులు నమోదు చేశాడు..ఇక లేటెస్ట్ గా 6 ఏళ్ల గ్యాప్ తర్వాత సోలో హీరోగా రామ్ చరణ్ చేసిన గేమ్ చేంజర్ మూవీ పెద్దగా బజ్ లేకుండా రిలీజ్ అయ్యి మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకుని మొదటి రోజు మొత్తం మీద….
56.42 కోట్ల షేర్ ని 92.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది….పోస్టర్ కలెక్షన్స్ నేషనల్ వైడ్ ట్రోల్ అవ్వగా…ఓవరాల్ గా మన టాప్ స్టార్ మూవీస్ లో లీస్ట్ పెర్ఫార్మెన్స్ ను చూపించిన సినిమాగా నిలిచింది. ఇక ఈ ఇయర్ పవన్ కళ్యాణ్ నుండి కూడా 2 సినిమాలు రానుండటం…ఇతర టాప్ స్టార్ మూవీస్ కొన్ని రిలీజ్ కానుండటంతో ఆ సినిమాలు ఎలా పెర్ఫార్మ్ చేస్తాయో చూడాలి.