తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ లాంగ్ రన్ ను అందుకోవడం చాలా కొద్ది సినిమాలకే జరుగుతూ ఉంటుంది, పెద్ద స్టార్ హీరోలకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉండగా, కొన్ని కొన్ని చిన్న సినిమాలు, కొన్ని ఊహించని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ ను ఎంజాయ్ చేశాయి. ఈ ఏడాది 2 సినిమాలు ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను….
తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకున్నాయి. రిలీజ్ కి ముందు ఎవ్వరూ ఊహించని హనుమాన్ మూవీ ఊహకందని లాంగ్ రన్ ను అందుకుంది. ఇక రీసెంట్ గా భారీ అంచనాలతో వచ్చి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న దేవర మూవీ ఊరమాస్ లాంగ్ రన్ ను దక్కించుకుంది…
ఓవరాల్ గా టాలీవుడ్ లో వచ్చిన మూవీస్ లో బాహుబలి2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రేంజ్ లో 28 రోజుల పాటు కంటిన్యూగా కోటికి తగ్గకుండా షేర్ ని అందుకుని మాస్ ఊచకోత కోసింది. తర్వాత ప్లేస్ లో బాహుబలి1 మరియు హనుమాన్ మూవీస్ నిలిచాయి. దేవర మూడో ప్లేస్ ని అందుకుంది…
ఒకసారి టాలీవుడ్ లో అత్యధిక రోజులు కోటికి తగ్గకుండా షేర్ ని అందుకున్న టాప్ మూవీస్ ని గమనిస్తే…
Top AP TG 1cr Plus Continuous Share Movies(All Time)
👉#Baahubali2 – 28 Days
👉#Baahubali – 20 Days
👉#HanuMan – 20 Days(inc premieres)
👉#Devara – 19 Days
👉#AlaVaikunthapurramuloo – 17 Days
👉#RRRMovie – 17 Days
👉#F2 – 16 Days
👉#Rangasthalam – 14 Days
👉#Maharshi – 14 Days
👉#AttarintikiDaredi – 13 Days
👉#SyeRaa – 13 Days
👉#SarileruNeekevvaru – 13 Days
👉#Kalki2898AD – 13 Days
మొత్తం మీద ఈ లిస్టులో కొన్ని ఎక్స్ పెర్ట్ చేయని సినిమాలు కూడా ఉన్నాయి…ఓవరాల్ గా టాలీవుడ్ చాలా ఏళ్లుగా బాహుబలి2 లాంటి ఎపిక్ రన్ ని దక్కించుకునే సినిమాల కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ ఇయర్ అలాంటి రన్ ని మ్యాచ్ చేస్తూ కొన్ని సినిమాలు ఆశలు చూపించాయి.
ఇక అప్ కమింగ్ టైంలో టాలీవుడ్ నుండి టాప్ స్టార్స్ నటించిన క్రేజీ మూవీస్ తో పాటు మరికొన్ని మీడియం బడ్జెట్ ఎక్స్ లెంట్ మూవీస్ కూడా రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి ఈ లిస్టులో మరిన్ని సినిమాలు ఎంటర్ అయ్యి ఎలాంటి రికార్డులు నమోదు చేస్తాయో చూడాలి ఇక…