కరోనా ఎఫెక్ట్ తో ఎక్కువగా ఇబ్బంది పడ్డ ఫీల్డ్స్ లో సినిమా ఫీల్డ్ ముందు ఉంటుంది…టెలివిజన్ ఫీల్డ్ అయినా తిరిగి షోలు షూటింగ్ జరుపుకుంటూ షోలు, సీరియల్స్ తో రీ ఎంట్రీ ఇచ్చారు కానీ సినిమా ఫీల్డ్ మాత్రం ఇప్పటికీ మూసి వేసే ఉంది. ముఖ్యంగా థియేటర్స్ మూసేసి ఆల్ మోస్ట్ 4 నెలలు కావొస్తుంది. మరి కొన్ని నెలల పాటు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉండగా నిర్మాతలు చాలా మంది ఓ నిర్ణయం తీసుకున్నారు.
టాలీవుడ్ లో హీరోలు, హీరోయిన్స్ మరియు డైరెక్టర్స్ రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని కోరగా… కొందరు ఓపెన్ గా తగ్గించుకుంటున్నామని చెప్పగా కొందరు సైలెంట్ గా ఎంతో కొంత తగ్గించుకునే పనిలో ఉన్నారు. కానీ కోలివుడ్ లో నిర్మాతలు హీరోలు, హీరోయిన్స్ మరియు డైరెక్టర్స్….
సగం రెమ్యునరేషన్ తగ్గించుకుని తీరాల్సిందే అంటూ తీర్మానం చేయగా అక్కడ కొద్దిగా విమర్శలు రావడం తో వాళ్ళు తగ్గి హీరోల నిర్ణయానికే వదిలేయగా ముందుగా కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ నుండి లేటెస్ట్ గా రెమ్యూనరేషన్ గురించిన న్యూస్ బయటికి వచ్చి అంతటా గట్టి గానే స్ప్రెడ్ అవుతుందని చెప్పాలి.
ప్రస్తుతం విజయ్ ఉన్న ఫాం కి ఒక్కో సినిమా కి అవలీలగా రెమ్యునరేషన్ కింద 50 కోట్లు… సినిమా ప్రాఫిట్ లో 15% వాటా తీసుకుంటూ ఉంటారని టాక్. కానీ పరిస్థితి సెట్ అయ్యే వరకు చేయబోతున్న సినిమాలకు గాను ఒక్కో సినిమాకి ఏకంగా 20 కోట్ల తగ్గించుకో బోతున్నారని న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఏకంగా 20 కోట్లు తగ్గించుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి…
కాగా ఈ న్యూస్ ఎంతవరకు నిజం అన్నది అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు తెలియదు కానీ ఏకంగా 20 కోట్లు తగ్గించు కోవడం అంటే గొప్ప విషయం అనే చెప్పాలి. ఇంకా మిగిలిన హీరోలు కూడా ఇదే రూట్ ని ఫాలో అయితే చాలా వరకు నిర్మాతలు కొంచం సేఫ్ జోన్ లో ఉండే అవకాశం ఉందని చెప్పాలి…