బాక్స్ అఫీస్ దగ్గర చాలా టైంగా క్లీన్ హిట్ కి దూరంగా ఉంటున్న టాలీవుడ్ హీరోలలో యూత్ స్టార్ నితిన్(Nithiin) ఒకరు కాగా రీసెంట్ గా నితిన్ నటించిన తమ్ముడు(Thammudu Movie) మీద భారీ ఆశలు పెట్టుకున్న నితిన్ కి మొదటి రోజే ఈ సినిమా చుక్కలు చూపించే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుందని చెప్పాలి ఇప్పుడు…
ప్రీ బుకింగ్స్ మొత్తం మీద 8.5 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా మొదటి రోజు సినిమాకి కేవలం 27 వేల లోపే టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రీసెంట్ టైం లో నితిన్ కెరీర్ లో మొదటి రోజు లోవేస్ట్ టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని…
తీవ్రంగా నిరాశ పరిచింది అని చెప్పాలి. ఇండియాలో సినిమా ఓవరాల్ గా 2 కోట్లకు పైగా గ్రాస్ ను మాత్రమే సొంతం చేసుకున్నట్లు అంచనా…ఇక వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 3 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ మార్క్ ని అందుకున్నట్లు అంచనా…
ఒకప్పుడు నితిన్ సినిమాలు ఎలా ఉన్నా కూడా మినిమమ్ ఓపెనింగ్స్ అయినా సొంతం అయ్యేవి…కానీ వరుస ఫ్లాఫ్స్ ఇంపాక్ట్…ఆడియన్స్ లో తన సినిమాల మీద క్రేజ్ అనుకున్న రేంజ్ లో లేక పోవడంతో నితిన్ సినిమాలను ఆడియన్స్ చూడటం మెల్లిమెల్లిగా తగ్గించేస్తున్నారు…
స్క్రిప్ట్ విషయంలో కూడా ఎప్పటికప్పుడు చేసిన తప్పులే మళ్ళీ చేస్తున్న నితిన్ మరోసారి ఇప్పుడు తమ్ముడుతో అంచనాలను అందుకోలేక పోయాడు…మొదటి రోజే వన్ ఆఫ్ ది లోవేస్ట్ ఓపెనింగ్స్ ను తన కెరీర్ లో సొంతం చేసుకున్న నితిన్ తమ్ముడు…
ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో అందుకోవాల్సిన వాల్యూ టార్గెట్ దృశ్యా ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి…ఇక మొదటి రోజు తమ్ముడు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అఫీషియల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక.