బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా టైం అవుతున్న టాలీవుడ్ హీరోల్లో యూత్ స్టార్ నితిన్(Nithiin) ఒకరు…ఆల్ మోస్ట్ ఐదున్నర ఏళ్ళుగా క్లీన్ హిట్ కి దూరంగా ఉంటున్న నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు(Thammudu Movie)తో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రాగా ఈ సినిమా తో అయినా అంచనాలను అందుకుంటాడని నమ్మకంతో ఉన్నాడు….మరి ఎంతవరకు అంచనాలను అందుకున్నాడో తెలుసుకుందాం పదండీ..
ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే…..లవ్ మ్యారేజ్ చేసుకున్న అక్క లయ ఇంట్లో ఎవరు సపోర్ట్ చేసినా చేయకున్నా తన తమ్ముడు నితిన్ సపోర్ట్ చేస్తాడు అని అనుకుంటుంది, కానీ తమ్ముడు సైలెంట్ గా ఉండటంతో చేసేదేమీ లేక ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది….తర్వాత కొంత టైంకి…
అక్క పెద్ద ప్రాబ్లం లో ఉందని తెలుసుకున్న తమ్ముడు ఏం చేశాడు…ఆ తర్వాత కథ ఏంటి అనేది అసలు కథ….మొత్తం మీద చాలా తిన్ స్టోరీ పాయింట్ తో తెరకెక్కిన తమ్ముడు సినిమా చాలా వరకు వేణు శ్రీ రామ్ ఇది వరకు డైరెక్ట్ చేసిన MCA సినిమాను మరోలా చెప్పినట్లు అనిపించగా…
అందులో వర్కౌట్ అయినట్లు కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో అనుకున్న రేంజ్ లో వర్కౌట్ అవ్వలేదు అనిపించింది…నితిన్ ఉన్నంతలో బాగానే పెర్ఫార్మ్ చేశాడు, హీరోయిజం సీన్స్ తో ఆకట్టుకున్నాడు…సీరియస్ టోన్ మెయిన్ టైన్ చేశాడు…కానీ ఎమోషనల్ కంటెంట్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది…
ఇక చాలా టైం తర్వాత వెండితెరకు తిరిగి వచ్చిన లయ ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా మెప్పించగా హీరోయిన్స్ ఓకే అనిపించారు…ఇక విలన్ రోల్ కొంచం కొత్తగా బాగుంది…మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు…ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పరంగా ఫస్టాఫ్ అండ్ సెకెండ్ ఆఫ్ లో…
చాలా సీన్స్ డ్రాగ్ అయిన ఫీలింగ్…లెంత్ మరీ ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగింది…కథ అంత బలంగా లేకపోవడంతో స్క్రీన్ ప్లే అనుకున్న రేంజ్ లో కుదరలేదు…. సంగీతం పెద్దగా ఇంపాక్ట్ లేదు…బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ కి బాగుంది… సినిమాటోగ్రఫీ ఎక్స్ లెంట్ గా ఉండగా విజువల్స్ బాగున్నాయి…ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి…
ఇక డైరెక్షన్ విషయానికి వస్తే వేణు శ్రీ రామ్ చాలా చాలా తిన్ స్టోరీ పాయింట్ ను ఎంచుకుని ఎమోషనల్ బాండింగ్ సీన్స్ ను నమ్ముకున్నాడు కానీ అవేవి అంతలా పండలేదు…అదే టైంలో యాక్షన్ సీన్స్ బాగున్నా…ఆ ఇంపాక్ట్ ఆడియన్స్ ఫీల్ అవ్వలేక పోయారు చాలా సీన్స్ లో…ఉన్నంతలో మేకింగ్ పరంగా సినిమా బాగున్నా…
ఓవరాల్ గా ఇది వరకు వేణు శ్రీ రామ్ మూవీస్ తో పోల్చితే కంటెంట్ ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది. సీస్స్ వైజ్ కొన్ని సీన్స్ బాగున్నా కూడా మరీ సినిమా రేంజ్ ను భారీగా పెంచే రేంజ్ లో అయితే లేవు… ఓవరాల్ గా మరీ మేకర్స్ చెప్పినట్లు సినిమా అంచనాలను మించిపోతుంది అన్న నమ్మకంతో…
ఆడియన్స్ థియేటర్స్ కి వెళితే మట్టుకు సినిమా ఆ అంచనాలను అందుకోవడం కష్టమే…అదే టైంలో లో ఎక్స్ పెర్టేషన్స్ తో వెళితే కొంచం పడుతూ లేస్తూ సినిమా సాగినా కొంచం ఓపికతో చూస్తె ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు… ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2.25 స్టార్స్…