రెండు బాక్ టు బాక్ భారీ డిసాస్టర్ మూవీస్ తర్వాత ఇప్పుడు సెన్సేషనల్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్నాడు యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమాతో….రిమార్కబుల్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేసిన ఈ సినిమా తొలిరోజు మాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న తర్వాత…
రెండో రోజు నార్మల్ గా ఏ సినిమా అయినా టికెట్ సేల్స్ లో డ్రాప్స్ ను చూడటం అన్నది కామన్, కానీ తండేల్ సినిమా విషయంలో ఇది రివర్స్ లో జరిగింది. మొదటి రోజున బుక్ మై షో లో తెగిన టికెట్స్ కన్నా కూడా రెండో రోజు సినిమాకి ఎక్కువ టికెట్ సేల్స్ సొంతం అయ్యి మాస్ రచ్చ చేయడం విశేషం..
సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్ సేల్స్ కూడా సాలిడ్ గానే జరగగా మొదటి రోజు మొత్తం మీద 227K టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా కుమ్మేసింది… ఇక రెండో రోజుకి వచ్చే సరికి మరింతగా జోరు చూపించి కుమ్మేసిన తండేల్ మూవీ మొదటి రోజుకి మించిపోయి…
ఏకంగా 260K టికెట్ సేల్స్ మార్క్ ని దాటేసి దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతుంది. ఈ టికెట్ సేల్స్ లో సండే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఉండగా, ఓవరాల్ గా కలెక్షన్స్ పరంగా మొదటి రోజుతో పోల్చితే సినిమాకి రెండో రోజు డ్రాప్స్ చాలా లిమిటెడ్ గానే ఉన్న నేపధ్యంలో..
ఇప్పుడు మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా వీకెండ్ లోనే బిజినెస్ లో చాలా మొత్తాన్ని వెనక్కి తీసుకు వచ్చే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.