బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి ప్రతీ రోజూ రికార్డుల భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతున్న యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా ఓవరాల్ గా 2 రోజులు పూర్తి అయ్యే టైం కి తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 26 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా…
36.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. ఇక సినిమా మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా రిమార్కబుల్ జోరుని చూపించి మాస్ రచ్చ చేసింది…తెలుగు రాష్ట్రాల్లో ట్రాక్ చేసిన సెంటర్స్ లో సినిమా ఓవరాల్ గా 13 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని…
అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే 14 కోట్ల రేంజ్ దాకా వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను ఈ రోజు చూపిస్తున్న సినిమా హిందీ లో తమిళ్ లో పర్వాలేదు అనిపిస్తూ ఉండగా..
ఓవర్సీస్ లో మరీ అనుకున్న రేంజ్ లో జోరు చూపించకున్నా కూడా బాగానే పెర్ఫార్మ్ చేస్తూ ఉండటంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 17-18 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే సినిమా…
18-19 కోట్ల రేంజ్ దాకా కూడా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. దాంతో ఈ రోజు సాధించే కలెక్షన్స్ తో సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 40 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 55 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను..
సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది, రెండో రోజు లెవల్ లో ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కంప్లీట్ గా అంచనాలను మరోసారి మించి పొతే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక టోటల్ గా సినిమా వీకెండ్ టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.