Home న్యూస్ తండేల్ థియేటర్స్, బుకింగ్స్ రిపోర్ట్…డే 1 ఎంత రావొచ్చు అంటే!

తండేల్ థియేటర్స్, బుకింగ్స్ రిపోర్ట్…డే 1 ఎంత రావొచ్చు అంటే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా ఆడియన్స్ ముందుకు గ్రాండ్ గా ఈ వీకెండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద మంచి బజ్ అయితే నెలకొనడంతో బిజినెస్ పరంగా సినిమా ఆల్ రెడీ సాలిడ్ గా కుమ్మేసింది.

నాగ చైతన్య కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంటూ ఏకంగా 37 కోట్ల రేంజ్ లో రేటుని సొంతం చేసుకోగా ఇక తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా సుమారు 700 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతూ ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియా లో…

ఓవరాల్ గా మరో 350 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా ఓవర్సీస్ లో 650 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న సినిమా వరల్డ్ వైడ్ గా 1700 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రెండు రోజుల ముందే ఓపెన్ చేయగా…

ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ తెలుగు రాష్ట్రాల్లో 4.2 కోట్ల మార్క్ ని అందుకోగా ఇండియా గ్రాస్ 5 కోట్ల మార్క్ ని ఓవర్సీస్ బుకింగ్స్ గ్రాస్ తో కలిపి టోటల్ గా 6.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను ఇప్పటి వరకు సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా..

నాగ చైతన్య రీసెంట్ మూవీస్ లో ఆల్ మోస్ట్ లవ్ స్టోరీ రేంజ్ లో బుకింగ్స్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండటంతో మొదటి రోజు టాక్ బాగుంటే తెలుగు రాష్ట్రాల్లో 6-7 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను వరల్డ్ వైడ్ గా 10 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా…

సినిమా ఆఫ్ లైన్ లో చూపించే జోరు అండ్ టాక్ తో షో షో కి కలెక్షన్స్ పరంగా జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఓవరాల్ గా అన్నీ అనుకున్నట్లు జరిగితే మొదటి రోజు సినిమా నాగ చైతన్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను నమోదు చేసే అవకాశం అయితే ఉందని చెప్పాలి ఇప్పుడు… మరి సినిమా ఎంతవరకు జోరు చూపుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here