బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉండగా.. సినిమా మొదటి రోజున ఓవరాల్ గా ఇప్పుడు…
నాగ చైతన్య కెరీర్ లో సెన్సేషనల్ డే 1 కలెక్షన్స్ ని నమోదు చేస్తూ మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. మూడేళ్ళ క్రితం సోలో హీరోగా నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా మొదటి రోజున తెలుగు రాష్ట్రాల్లో 10.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా…
వరల్డ్ వైడ్ గా 16.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక తర్వాత నాగ చైతన్య చేసిన 2 సినిమాలు అట్టర్ ఫ్లాఫ్ రిజల్ట్ లను సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన తండేల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజున తెలుగు రాష్ట్రాల్లో…
ఓవరాల్ గా ట్రాక్ చేసిన లెక్కలను బట్టి చూస్తుంటే 11-12 కోట్ల రేంజ్ కి తగ్గని గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లెక్కలు కలిపి వరల్డ్ వైడ్ గా 17-18 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం…
ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. దాంతో నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను నమోదు చేయడం ఇప్పుడు ఖాయంగా కనిపిస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక అంచనాలను మించిపోతే తండేల్ మూవీ 18 కోట్లు ఆ పైన గ్రాస్ ను కూడా అందుకునే అవకాశం ఉంది. ఇక డే 1 అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.