Home న్యూస్ రాయలసీమ లో తండేల్ బిజినెస్…టాక్ వస్తే కుమ్ముడే!!

రాయలసీమ లో తండేల్ బిజినెస్…టాక్ వస్తే కుమ్ముడే!!

0

బాక్ టు బాక్ రెండు ఫ్లాఫ్స్ పడినా కూడా యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా తో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా, సినిమా మీద ఆల్ రెడీ ట్రేడ్ లో ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది..

ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ తో పాటు థియేట్రికల్ బిజినెస్ పరంగా కూడా కుమ్మేస్తూ దూసుకు పోతున్న తండేల్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ తో కుమ్మేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఆల్ రెడీ నైజాం లో అలాగే కోస్టల్ ఆంధ్రలో సినిమా కి సాలిడ్ బిజినెస్ జరిగింది.

ఇక సినిమాకి రాయలసీమ లాంటి మాస్ ఏరియాలో కూడా మంచి బిజినెస్ జరిగింది ఇప్పుడు, టాక్ ఏమాత్రం బాగున్నా కూడా సినిమా ఇక్కడ సాలిడ్ ఓపెనింగ్స్ తో కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద రాయలసీమ ఏరియాలో తండేల్ మూవీ కి…

4.8 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ సొంతం అయ్యింది ఇప్పుడు, బాక్ టు బాక్ రెండు భారీ డిసాస్టర్ లు పడ్డా కూడా తండేల్ మూవీ తో మరోసారి నాగ చైతన్య మాస్ రచ్చ చేసాడు బిజినెస్ పరంగా. సినిమాలో సాయి పల్లవి ఉండటం మరో బిగ్ ప్లస్ పాయింట్ అవ్వగా…

కార్తికేయ2 తో బ్లాక్ బస్టర్ కొట్టిన చందు మొండేది డైరెక్షన్ లో ఈ సినిమా వస్తూ ఉండటంతో మినిమమ్ గ్యారెంటీ లెవల్ లో సినిమా ఉండబోతుంది అన్న నమ్మకం అందరిలోనూ ఉంది. సినిమా కూడా ఏమాత్రం టాక్ డీసెంట్ గా వచ్చినా కూడా ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో కుమ్మేయడం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here