బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ ను సొంతం చేసుకున్నా కూడా మంచి బజ్ ను సొంతం చేసుకున్న యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమాతో ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా..
సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది, కాగా సినిమా మొత్తం మీద యు/ఏ సర్టిఫికేట్ ను సొంతం చేసుకోగా 2 గంటల 32 నిమిషాల రన్ టైంతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇక సెన్సార్ వాళ్ళ నుండి సినిమాకి ఫస్ట్ టాక్ ఎలా ఉన్నది అన్నది కూడా రివీల్ అయింది.
మొత్తం స్టోరీ పాయింట్ ను ఏమి రివీల్ చేయడం లేదు కానీ ఒకరంటే ఒకరికి ప్రాణం అయిన హీరో హీరోయిన్స్ అనుకోకుండా ఒక కారణం వలన విడిపోవాల్సి వస్తుంది..ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా కథ పాయింట్ గా చెబుతున్నారు…
ఆ విడిపోవడానికి పాకిస్థాన్ కూడా ఒక కారణం అవ్వగా తర్వాత ఏం జరిగింది అన్నది మిగిలిన కథ….ఫస్టాఫ్ హీరో హీరోయిన్స్ క్యూట్ లవ్ స్టోరీ, మంచి సోల్ ఫుల్ మ్యూజిక్ తో ఆకట్టుకుంటూ సాగి తర్వాత ఇంటర్వెల్ ఎపిసోడ్ సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెంచగా..
సెకెండ్ ఆఫ్ లో మెలోడ్రామ అక్కడక్కడా ట్రాక్ తప్పినట్లు అనిపించినా చాలా చోట్ల ఎమోషన్స్ బాగానే వర్కౌట్ అవ్వడంతో సినిమా ఓవరాల్ గా ఎండ్ అయ్యే టైంకి మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఎండ్ అవుతుందని అంటున్నారు…
మొత్తం మీద ఫస్టాఫ్ ఎబో యావరేజ్ లెవల్ లో సెకెండ్ ఆఫ్ గుడ్ అనిపించేలా ఉంటుందని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా ఎబో యావరేజ్ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు….నాగ చైతన్య రీసెంట్ మూవీస్ మీద చాలా బెటర్ కంటెంట్ అండ్ మ్యూజిక్ తో…
తండెల్ మూవీ ఉంటుందని అంటున్నారు, ఇక నాగ చైతన్య సాయి పల్లవిల కాంబో సీన్స్ అన్నీ కూడా బాగా రావడం, యూత్ కి లవర్స్ కి బాగా ఆకట్టుకునేలా సినిమా ఉందని అంటున్నారు.. ఓవరాల్ గా సెన్సార్ వాళ్ళ నుండి సినిమాకి మంచి టాక్ అయితే సొంతం అయ్యిందని చెప్పాలి. ఇక ఆడియన్స్ ముందుకు వచ్చాక సినిమాకి ఎలాంటి టాక్ సొంతం అవుతుందో చూడాలి.