బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ సీజన్ అయిన ఫిబ్రవరి నెలలో ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపే విజయాన్ని సొంతం చేసుకున్న యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా లాంగ్ రన్ లో…
రిమార్కబుల్ జోరు ని చూపించి మాస్ కుమ్ముడు కుమ్మేసింది…సినిమా తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ ను దాటేసి మంచి లాభాలను సొంతం చేసుకోగా నైజాం ఏరియాలో లాంగ్ రన్ లో ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపించి నాగ చైతన్య కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని…
సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. నాగ చైతన్య ప్రీవియస్ 2 మూవీస్ ఎపిక్ డిసాస్టర్స్ అయినా కూడా తండేల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 10.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా త్వరగానే ఇక్కడ బ్రేక్ ఈవెన్ ని దాటేసిన సినిమా తర్వాత కూడా…
ఎక్స్ లెంట్ కలెక్షన్స్ జోరు ని కొనసాగించి లాంగ్ రన్ లో ఏకంగా 19.90 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది సినిమా…..ఆల్ మోస్ట్ 4 వారాల పాటు లిమిటెడ్ థియేటర్స్ లో పర్వాలేదు అనిపించేలా షేర్స్ ని సాధించిన సినిమా…
ఓవరాల్ గా 10.50 కోట్ల బిజినెస్ మీద టోటల్ రన్ లో 9.40 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఇక్కడే బ్లాక్ బస్టర్ హిట్ గా దుమ్ము దుమారం లేపింది. అన్ సీజన్ లో కాకుండా ఏదైనా హాలిడే వీకెండ్ లో కనుక రిలీజ్ అయ్యి ఉంటే సినిమా బాక్స్ ఆఫీస్ రాంపెజ్ ఇంకో లెవల్ లో ఉండేదని చెప్పొచ్చు.