బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో మంచి అంచనాల నడుమ రిలీజ్ కాబోతున్న సినిమా యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా… వరుసగా రెండు బాక్ టు బాక్ డిసాస్టర్ లు పడ్డా కూడా ఈ సినిమాతో సాలిడ్ బజ్ నే సొంతం చేసుకున్నాడు నాగ చైతన్య..
నాగ చైతన్య మరియు సాయి పల్లవి ల కాంబోలో లవ్ స్టోరీ లాంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా అవ్వడం, అలాగే కార్తికేయ2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చందు మొండేటి డైరెక్షన్ లో వస్తున్న సినిమా కూడా అవ్వడం….ఆడియో సూపర్ డూపర్ హిట్ అవ్వడం కలిసి వచ్చి..
సినిమా మీద ఆడియన్స్ లో మంచి బజ్ నెలకొంది. సినిమా ఏమాత్రం టాక్ పాజిటివ్ గా ఉన్నా కూడా ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక బిజినెస్ పరంగా ఫ్లాఫ్స్ ఇంపాక్ట్ ఉన్నా కూడా తండేల్ మూవీ సాలిడ్ బిజినెస్ నే అందుకుంది…
నైజాం లో, కోస్టల్ ఆంధ్రలో సాలిడ్ బిజినెస్ ను అందుకున్న సినిమా సీడెడ్ లో కూడా కుమ్మేసింది. ఇక ఓవర్సీస్ ఓ సినిమా మీద మంచి బజ్ ఉండటంతో అక్కడ కూడా సాలిడ్ బిజినెస్ ను అందుకున్న సినిమా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే…
#Thandel WW Pre Release Business Details(Valued)
👉Nizam: 10.50Cr
👉Ceeded: 5Cr
👉Andhra: 12Cr
AP-TG Total:- 27.50CR
👉KA+ROI: 3.50Cr
👉OS – 6Cr
Total WW: 37.00CR(Break Even- 38CR+)
ఇదీ మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు….సినిమా వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే ఇప్పుడు 38 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. సినిమా కి ఉన్న బజ్ దృశ్యా మినిమమ్ టాక్ పాజిటివ్ గా వచ్చినా మంచి జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉంది.