Home టోటల్ కలెక్షన్స్ తండేల్ టోటల్ కలెక్షన్స్….నాగ చైతన్య కంబ్యాక్ సూపర్ హిట్!!

తండేల్ టోటల్ కలెక్షన్స్….నాగ చైతన్య కంబ్యాక్ సూపర్ హిట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో వరుస ఫ్లాఫ్స్ తో సతమతం అవుతున్న హీరోల్లో ఒకరైన యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) భారీ అంచనాలతో భారీ బడ్జెట్ తో చేసిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) మూవీ రిలీజ్ కి ముందు నుండి మంచి అంచనాలు ఏర్పడగా సినిమా రిలీజ్ అయ్యాక…

ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుని ఓపెనింగ్ వీకెండ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా రికార్డులను నమోదు చేయగా తర్వాత కొంచం స్లో అయినా కూడా స్టడీగానే లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసి మాస్ రచ్చ చేసిన తండేల్ మూవీ ఓవరాల్ గా…

నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ కంబ్యాక్ గా నిలవడమే కాకుండా తన కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసి మొదటి సారిగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని నాగ చైతన్య కెరీర్ లో సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది.

Naga Chaitanya Thandel Movie 25 Days Total WW Collections!!

ఒకసారి సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Thandel Movie Total World Wide Collections Report(Inc GST)
👉Nizam: 20.05Cr
👉Ceeded: 6.65Cr
👉UA: 6.95Cr
👉East: 3.03Cr
👉West: 2.14Cr
👉Guntur: 2.41Cr
👉Krishna: 2.26Cr
👉Nellore: 1.44Cr
AP-TG Total:- 44.93CR(77.85CR~ Gross)(Gross Updated)
👉KA+ROI+Dub: 4.60Cr
👉OS – 4.72Cr****approx
Total WW Collections: 54.25CR(Gross – 100.10CR~)

మొత్తం మీద సినిమా 38 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఓవరాల్ గా టార్గెట్ మీద 16.25 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని సూపర్ హిట్ గా రన్ ను కంప్లీట్ చేసుకుని మీడియం రేంజ్ మూవీస్ లో కూడా వన్ ఆఫ్ ది హైయెస్ట్ షేర్ ని అందుకున్న సినిమాగా నిలిచింది.

Naga Chaitanya Thandel Movie Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here