బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హిట్స్ తో కెరీర్ బెస్ట్ ఫామ్ తో దూసుకు పోతున్న యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఇప్పుడు ఆడియన్స్ ముందుకు థాంక్ యు సినిమాతో తన లక్ ని పరీక్షించు కోవడానికి సిద్ధం అవుతున్నాడు. కాగా బాక్ టు బాక్ మజిలీ, వెంకిమామ, లవ్ స్టొరీ మరియు బంగార్రాజు సినిమాలు ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ అయ్యి విజయాలు గా నిలిచాయి.
ఇందులో 2 మల్టీ స్టారర్ మూవీస్ కాగా ఓవరాల్ గా 4 హిట్ మూవీస్ తర్వాత నాగ చైతన్య చేస్తున్న లేటెస్ట్ మూవీ థాంక్ యు సినిమా కి గాను 10 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని తీసుకోబోతుండగా ఇతర స్టార్ కాస్ట్ రెమ్యునరేషన్స్ అన్నీ కలిపి మరో 8 కోట్ల దాకా రెమ్యునరేషన్స్ వెళ్లాయని టాక్ ఉంది.
ఇక సినిమా కి రెమ్యునరేషన్స్ కాకుండా మిగిలిన ప్రొడక్షన్ కాస్ట్ ఆల్ మోస్ట్ 12 కోట్ల దాకా అయ్యిందని అంటున్నారు. దాంతో ఓవరాల్ గా సినిమా 30 కోట్ల రేంజ్ బడ్జెట్ లో కంప్లీట్ అయిందని అంటున్నారు. ఇక సినిమా టోటల్ బిజినెస్ డీటైల్స్ ఇంకా క్లియర్ గా రివీల్ అవ్వాల్సి ఉండగా నిర్మాతకి నాన్ థియేట్రికల్ తో మంచి రిటర్న్స్ సొంతం అయ్యే అవకాశం ఉంది. ఆ డీటైల్స్ త్వరలో అప్ డేట్ అవుతాయి.