యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య బాక్ టు బాక్ హిట్స్ తర్వాత చేసిన లేటెస్ట్ మూవీ థాంక్ యు… నాగ చైతన్య నటించిన రీసెంట్ మూవీస్ వరుస విజయాలుగా నిలిచినప్పటికీ కూడా ఈ సినిమా పై అంతగా బజ్ ఏర్పడలేదు. కానీ వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయిన థాంక్ యు ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ.. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే….
ఒక చిన్న విలేజ్ నుండి అమెరికాకి వెళ్లి అక్కడ ఓ కంపెనీకి ఓనర్ గా మారి బిలియనీర్ గా ఎదిగిన హీరో… ఈ ఎదిగే క్రమంలో తనకి ఎదో ఒక విధంగా హెల్ప్ చేసిన వాళ్ళని మర్చి… తన ఎదుగుదలకి పూర్తిగా తన కష్టమే కారణం అనుకుంటూ ఉంటాడు… అలాంటి వ్యక్తీ ఎలా మారాడు… మారిన తర్వాత ఏం చేశాడు అన్నది… మొత్తం మీద సినిమా కథ….
పెర్ఫార్మెన్స్ పరంగా నాగ చైతన్య తన భుజాన ఈ సినిమాను మోశాడు…. డిఫెరెంట్ ఏజ్ టైం లో డిఫెరెంట్ లుక్స్ తో తన నటన మెప్పించింది. ఇక రాశిఖన్నా రోల్ కూడా పర్వాలేదు అనిపించగా మిగిలిన రోల్స్ అన్నీ కూడా ఉన్నంతలో బాగానే నటించి మెప్పించారు. ఇక సంగీతం విషయానికి వస్తే…
తమన్ సాంగ్స్ జస్ట్ ఓకే అనిపించే విధంగా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా తన రేంజ్ కి తగ్గట్లు అయితే లేదు, సినిమాటోగ్రఫీ చాలా బాగా మెప్పించాగా విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే నీరసంగా సాగుతుంది…. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే…. విక్రమ్ కుమార్…
తన కెరీర్ లోనే వీకేస్ట్ స్టొరీ పాయింట్ తో చేసిన సినిమా థాంక్ యు అని చెప్పాలి. 13B, మనం, 24 లాంటి రిమార్కబుల్ మూవీస్ తీసిన డైరెక్టర్ ఇంత సింపుల్ కాన్సెప్ట్ ఉన్న మూవీని చేయడం, నాగ చైతన్యని ఎలా ఒప్పించాడు అనిపిస్తుంది సినిమా… కంప్లీట్ గా అర్బన్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా థాంక్ యు….
కానీ మన దగ్గర ఇప్పటికీ ఇలాంటి అర్బన్ కాన్సెప్ట్ స్టొరీలకు సరైన మార్కెట్ అయితే లేదు…. మొత్తం మీద సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే నాగ చైతన్య పెర్ఫార్మెన్స్, గ్రాండ్ విజువల్స్, ఎమోషనల్ క్లైమాక్స్ అని చెప్పాలి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే….
తిన్ స్టొరీ లైన్, వీక్ డైరెక్షన్ నరేషన్ ఫ్లాట్ గా ఉండటం అని చెప్పాలి. అర్బన్ ఆడియన్స్ కి సినిమా పర్వాలేదు అనిపించవచ్చు కానీ, మాస్ అండ్ కమర్షియల్ మూవీస్ ని ఎక్కువగా చూసే ఆడియన్స్ కి సినిమా నీరసం తెప్పించడం ఖాయమని చెప్పాలి. కానీ అలాంటి సినిమాలు చూసి చూసి ఉన్న ఆడియన్స్…
కొంచం క్లాస్ టచ్ ఉన్న మూవీని చూడాలి అని ఆశ పడితే కొంచం ఓపిక చేసుకుని థాంక్ యు మూవీని చూస్తె ఉన్నంతలో కొంచం ఓపిక పడితే సినిమా పర్వాలేదు అనిపించవచ్చు… ఓవరాల్ గా థాంక్ యు సినిమా కి ఫైనల్ మా రేటింగ్ 2.5 స్టార్స్….