యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ థాంక్ యు మొదటి రోజు డిసాస్టరస్ ఓపెనింగ్స్ ని అందుకుంది, అమెరికాలో కొంచం పర్వాలేదు అనిపించినా మిగిలిన చోట్ల మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది సినిమా. ఇక రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 40% కి పైగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో ఏమాత్రం హోల్డ్ చేయలేక పోయిన…
సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా ఇంపాక్ట్ ని చూపించలేక పోతుంది. మొత్తం మీద ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సినిమా 80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. అది కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు డీసెంట్ గా ఉంటె…
ఒకవేళ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 90 లక్షల నుండి 1 కోటి దాకా ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉంది కానీ ఓవరాల్ గా ఈ కలెక్షన్స్ తీవ్రంగా నిరాశ పరిచే లెక్కలు అనే చెప్పాలి. ఇక డే 2 ఎండ్ అయ్యే టైం కి ఎంతవరకు కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.