బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ 2 డిసాస్టర్ మూవీస్ తర్వాత కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ ఇప్పుడు మాస్ రచ్చ చేస్తూ నాగ చైతన్య కెరీర్ లో సోలో హీరోగా ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ దిశగా దూసుకు పోతూ ఉండగా…
బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తర్వాత ఇక నాగ చైతన్య మార్కెట్ ఆల్ మోస్ట్ డ్రాస్టికల్ గా పడిపోయింది అని అందరూ అనుకున్నారు…కానీ ఇప్పుడు ఎపిక్ కంబ్యాక్ ను తండేల్ మూవీతో సొంతం చేసుకున్నాడు నాగ చైతన్య…. నాగ చైతన్య నటించిన థాంక్ యు మరియు కస్టడీ సినిమాలు….
ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ అయ్యి ఎపిక్ డిసాస్టర్లుగా నిలిచాయి…థాంక్ యు మూవీ అయితే టోటల్ రన్ లో 8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంటే కస్టడీ మూవీ టోటల్ రన్ లో 16 కోట్ల లోపే గ్రాస్ ను సొంతం చేసుకుంది. రెండు సినిమాలు కలిపి బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా…
24 కోట్ల లోపే గ్రాస్ ను అందుకోగా ఇప్పుడు ఈ కలెక్షన్స్ ని ఆల్ మోస్ట్ రెండు రోజున్నర లోనే రాబట్టిన నాగ చైతన్య, వీకెండ్ వసూళ్ళతో బాక్స్ ఆఫీస్ దగ్గర రెండున్నర రెట్ల కలెక్షన్స్ ని రాబట్టి ఎక్స్ లెంట్ గా జోరు చూపెడుతూ మాస్ రచ్చ చేయడం విశేషం…
త్వరలోనే సినిమా నాగ చైతన్య కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోబోతూ ఉండగా వర్కింగ్ డేస్ లో అనుకున్న రేంజ్ లో కనుక హోల్డ్ చేస్తే అవలీలగా 100 కోట్ల గ్రాస్ మార్క్ వైపు పరుగులు పెట్టె అవకాశం సినిమా కి ఉందని చెప్పాలి. మరి ఈ మార్క్ ని సినిమా లాంగ్ రన్ లో అందుకుంటుందో లేదో చూడాలి ఇక…