Home న్యూస్ ది ఘోస్ట్ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

ది ఘోస్ట్ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

కింగ్ నాగార్జున సోలో హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్… కంప్లీట్ గా న్యూ జానర్ లో యాక్షన్ సీన్స్ తో నిండిపోయిన ఈ సినిమాను ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేయగా సినిమా టీసర్ ట్రైలర్ ల రిలీజ్ తర్వాత మంచి బజ్ నే సొంతం చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా పోటిలో రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే….

ఇంటర్ పోల్ ఆఫీసర్ అయిన నాగార్జున తన టీంతో ఒక మిషన్ తర్వాత ఒక మిషన్ కి వెళుతూ ఉంటాడు, ఒక మిషన్ లో జరిగిన మిస్టేక్ వలన కొంత గ్యాప్ తర్వాత హై ప్రొఫైల్ ఫ్యామిలీస్ కి సెక్యూరిటీగా ఉంటాడు. అలా ఓ ఫ్యామిలీకి సెక్యూరిటీగా ఉంటున్న టైం లో ఆ ఇంటి పాపని కిడ్నాప్ చేయాలని కొందరు ట్రై చేస్తారు. తర్వాత ఏం జరిగింది, ఇంతకీ హీరో ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

సినిమా చూడటానికి ముందు ఇది కంప్లీట్ గా యాక్షన్ నేపధ్యంలో తెరకెక్కిన న్యూ జానర్ సినిమా అని గమనించి సినిమా కి వెళ్ళడం బెటర్… ఎందుకంటే ఇతర సినిమాల మాదిరిగా కథ అంత బలంగా ఏమి ఉండదు, చాలా వరకు సీన్స్ ని ఆడియన్స్ ఊహించినట్లే ఉంటుంది…. కానీ యాక్షన్ మూవీ లవర్స్ కి మాత్రం సినిమా బాగా నచ్చే అవకాశం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి…

సినిమాలో వచ్చే ఫైట్ సీన్స్ అన్నీ కూడా ఓ రేంజ్ లో ఉంటాయి, ఒక దశలో ఫైట్స్ మరీ ఎక్కువ అయ్యాయి అనిపించినా కానీ ఆ సీన్స్ ని బాగా డీల్ చేశాడు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు…. చర్చ్ ఫైట్ ఊరమాస్ అనిపించే లెవల్ లో ఉంటుంది… ఇక పెర్ఫార్మెన్స్ పరంగా నాగార్జున లుక్, యాటిట్యూడ్, డైలాగ్స్, హీరోయిజం సీన్స్ ఇలా అన్నింటిలో దుమ్ము లేపాడు… సోనల్ చౌహాన్ కూడా యాక్షన్ సీన్స్ లో అదరగొట్టగా ఇతర రోల్స్ లో నటించిన వారందరూ కూడా తమ రోల్స్ లో మెప్పించారు…

సంగీతం బిలో యావరేజ్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఇంప్రెస్ చేయలేదు, సరైన బ్యాగ్రౌండ్ స్కోర్ పడి ఉంటే సినిమా రేంజ్ మరింతగా పెరిగి ఉండేది, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే రొటీన్ గానే ఉంటుంది. యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి, సినిమాటోగ్రఫీ ఎక్స్ లెంట్ గా ఉండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పిస్తాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే ప్రవీణ్ సత్తారు కథ పరంగా ఏమి మ్యాజిక్ చేయక పోయినా…

యాక్షన్ సీన్స్ మాత్రం ఓ రేంజ్ లో రూపొంచాడు, కథ కూడా ఇంకొంచం బెటర్ గా రాసుకుని ఉంటే బాగుండేది, ఎమోషనల్ సీన్స్ కొన్ని ఉన్నా ఆడియన్స్ కి అవి కనెక్ట్ అవ్వడం కష్టమే… మొత్తం మీద యాక్షన్ పార్ట్ వరకు సక్సెస్ అయినా కథ పరంగా సక్సెస్ కాలేదు. మొత్తం మీద సినిమా యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. రెగ్యులర్ మూవీస్ చూసే ఆడియన్స్ కి సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ బోర్ ఫీల్ అయ్యేలా చేయడం ఖాయం….. కానీ ఓపిక చేసుకుని చూస్తె పర్వాలేదు అనిపించవచ్చు. ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here