Home న్యూస్ ది రాజా సాబ్ టీసర్ రివ్యూ….బాక్స్ ఆఫీస్ మాస్ జాతర ఖాయం!

ది రాజా సాబ్ టీసర్ రివ్యూ….బాక్స్ ఆఫీస్ మాస్ జాతర ఖాయం!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా రేంజ్ లో కల్కి సినిమాతో బిగ్గెస్ట్ సక్సెస్ ను సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్(The Raja Saab Movie) మంచి అంచనాల నడుమ ఈ ఇయర్ ఎండ్ లో ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉండగా సినిమా మీద ఆల్ రెడీ ఎక్స్ పెర్టేషన్స్ సాలిడ్ గా ఉండగా…

సినిమా అఫీషియల్ టీసర్ రిలీజ్ తర్వాత ఆ ఎక్స్ పెర్టేషన్స్ మరో లెవల్ కి వెళ్ళిపోయాయి అని చెప్పాలి. ఆ రేంజ్ లో టీసర్ క్వాలిటీ పరంగా విజువల్ పరంగా ఇంప్రెస్ చేసింది. ప్రభాస్ రీసెంట్ టైం లుక్స్ తో పోల్చితే క్లాస్ టచ్ తో ఈ సారి దుమ్ము లేపబోతుండగా…

కామెడీ టచ్ తో కూడా ఈ సారి ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయబోతున్నాడు. టీసర్ లో కథ పాయింట్ ను కూడా కొద్ది వరకు రివీల్ చేయగా…ఒక రాజు తన ఇంట్లో తన ఆస్తి మొత్తాన్ని పెట్టి తను చనిపోయిన తర్వాత కూడా ఆ ఆస్తి తన ఒక్కడికే చెల్లుతుంది అంటూ ఆత్మగా…

ఆ ఇంట్లోనే ఉంటాడు…అలాంటి ఇంటికి వచ్చిన హీరో ఏం చేశాడు అక్కడ ఉండే ఫ్యామిలీ తో కలిసి చేసిన సందడి ఏంటి…ఆ ఆత్మ హీరోని ఎలా టార్గెట్ చేసింది అన్నది కథ పాయింట్…చంద్రముఖి స్టోరీ పాయింట్ లానే అనిపించినా కూడా హర్రర్ కామెడీ లు తీయడంలో…

దిట్ట అయిన డైరెక్టర్ మారుతి ఈ సారి పాన్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్ తో చేయబోతున్న ఈ హర్రర్ కామెడీ ఏమాత్రం వర్కౌట్ అయినా అన్ని ఇండస్ట్రీ లలో కూడా మాసివ్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపే అవకాశం ఈ సినిమా కి ఎంతైనా ఉందని చెప్పాలి. 

ఇక సినిమా టీసర్ కి తమన్ కొట్టిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరో హైలెట్ గా నిలవగా విజువల్స్ కానీ గ్రాండియర్ కానీ గ్రాఫిక్స్ కానీ అన్నీ టీసర్ వరకు బాగానే సెట్ అయ్యాయి. కంటెంట్ కూడా అదే రేంజ్ లో క్లిక్ అయితే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర తన మ్యాజిక్ ని ప్రభాస్ చూపించడం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here