ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ ని సొంతం చేసుకున్న రామ్ పోతినేని రెడ్ సినిమాతో మరో హిట్ అందుకోగా ఇప్పుడు హాట్రిక్ హిట్స్ పై కన్నేశాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ లేటెస్ట్ మూవీ ది వారియర్ భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. ఈ సినిమా పై మాస్ లో మంచి అంచనాలు ఉండగా టైర్ 2 హీరోల్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని ఈ సినిమా సొంతం చేసుకునే అవకాశం…
ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా బిజినెస్ కూడా యమ జోరుగా కొనసాగుతూ ఉండగా రీసెంట్ గా సినిమా నైజాం ఏరియా బిజినెస్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయినట్లు తెలుస్తుంది. కాగా సినిమా నైజాం ఏరియాలో రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ అనిపించే రేంజ్ లో…
బిజినెస్ ను ఇప్పుడు సొంతం చేసుకుంది. ఏకంగా 11 కోట్ల దాకా రేటు ని ఈ సినిమా నైజాం ఏరియాలో సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాల అంచనా, తెలుగు రాష్ట్రాల ఓవరాల్ బిజినెస్ కూడా రామ్ కెరీర్ లో హైయెస్ట్ అనిపించే విధంగా ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక దాడి చేయడం ఒక్కటే బాలెన్స్ అని చెప్పాలి.