Home న్యూస్ ది వారియర్ మూవీ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

ది వారియర్ మూవీ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ది వారియర్ ఈ మధ్య వచ్చిన మీడియం రేంజ్ మూవీస్ లో బెస్ట్ బజ్ ను సొంతం చేసుకున్న సినిమా అని చెప్పాలి. సాంగ్స్ మంచి రీచ్ ని సొంతం చేసుకోవడం, ట్రైలర్ క్లిక్ అవ్వడం, మాస్ ఎలిమెంట్స్ ఫుల్ గా ఉండటం లాంటి మేజర్ ప్లస్ పాయింట్స్ తో రిలీజ్ అయిన ది వారియర్ మూవీ ఎలా ఉంది, ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే….కర్నూల్ సిటీని తన కంట్రోల్ లో పెట్టుకున్న ఆదిని ఎదిరించే వారే ఉండరు… అలాంటి టైం లో MBBS చదువుతున్న హీరో రేడియో జాకీ అయిన హీరోయిన్ లవ్ లో ఉంటారు…. అనుకోకుండా జరిగిన కొన్ని ఇంసిడెంట్ ల తర్వాత పోలిస్ అయిన హీరో వస్తాడు….

ఇక తర్వాత హీరో విలన్ ల మధ్య నువ్వే నేనా అన్నట్లు సాగే కథలో ఎవరు గెలిచారో అన్నది మిగిలిన కథ, మరి ఈ కథలో హీరో ఒక్కరా లేక ఇద్దరా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పెర్ఫార్మెన్స్ పరంగా రామ్ ఫుల్ ఎనర్జీతో కుమ్మేశాడు, తన నటన పెర్ఫార్మెన్స్ చాలా బాగా మెప్పించాయి…

No Stopping for the Ram Pothineni's Bullet Song

డాన్సులు అదరగొట్టాడు, హీరోయిజం ఎలివేట్ సీన్స్ తో రెచ్చిపోయాడు… ఇక ఆది పినిశెట్టి ఫస్టాఫ్ లో ఎక్కువ డామినేట్ చేయగా సెకెండ్ ఆఫ్ లో హీరోకి ఏమాత్రం తీసిపోకుండా నువ్వా నేనా అన్నట్లు మెప్పించాడు. హీరో విలన్ ల సీన్స్ కొన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి… ఇక హీరోయిన్ జస్ట్ ఓకే అనిపించగా నదియా రోల్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. మిగిలిన యాక్టర్స్ కూడా బాగానే నటించి మెప్పించారు…

పాటల విషయంలో దేవి శ్రీ ప్రసాద్ చేసిన మ్యాజిక్ బాగా వర్కౌట్ అయినా కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం జస్ట్ ఓకే అనిపించుకున్నాడు దేవి… బ్యాగ్రౌండ్ స్కోర్ పాటల రేంజ్ లో ఉండి ఉంటె సినిమా మరో రేంజ్ లో ఎలివేట్ అయ్యి ఉండేది. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఇలాంటి కమర్షియల్ మూవీస్ కి ఎలా ఉంటుందో అలానే రొటీన్ గానే ఉండగా….

సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పిస్తాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే లింగుస్వామి చాలా రొటీన్ కథని ఓ చిన్న ట్విస్ట్ ఎలిమెంట్ తో రాసుకుని స్క్రీన్ ప్లే పరంగా మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశాడు. అది చాలా సీన్స్ లో వర్కౌట్ అయింది కూడా ఫస్టాఫ్ వరకు విలన్ ని హైలెట్ చేసినా పర్వాలేదు అనిపించినప్పటికీ సెకెండ్ ఆఫ్ లో….

హీరో విలన్ ల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగే సీన్స్, పోలిస్ స్టేషన్ లో వచ్చే సీన్ కొండా రెడ్డి బురుజు దగ్గర సీన్ బాగా వచ్చాయి కానీ ఫస్టాఫ్ ఇంపాక్ట్ తో పోల్చితే సెకెండ్ ఆఫ్ ఇంపాక్ట్ తగ్గింది…ఇక తర్వాత సీన్ ఏం అవుతుంది అన్నది ఆడియన్స్ దాదాపు అనుకున్నట్లే జరుగుతూ సాగడంతో రొటీన్ గానే సాగింది సినిమా. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే…

రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, ఆది మాస్ విలనిజం, దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్, యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్ తర్వాత పోలిస్ స్టేషన్ సీన్ అని చెప్పాలి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే చాలా రొటీన్ స్టొరీ, లవ్ ట్రాక్ అండ్ దేవి శ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. కమర్షియల్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ మాస్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి సినిమా రొటీన్ కథనే అయినా సినిమా నచ్చుతుంది. మిగిలిన ఆడియన్స్ కి సినిమా ఓ 10-15 ఏళ్ల క్రితం సినిమాలా అనిపిస్తుంది…

మొత్తం మీద ట్రైలర్ నుండే ఇది ఫక్తు కమర్షియల్ మూవీలానే అనిపించగా జనాలు కూడా అదే మైండ్ లో పెట్టుకుని హీరో విలన్ ల నువ్వా నేనా అన్నట్లు సాగే ఈ మాస్ మూవీని అదే దృష్టితో చూస్తె కొంచం రొటీన్ అనిపించినా సినిమా చాలా వరకు మెప్పిస్తుంది అని చెప్పొచ్చు. మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here