సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సిన పెద్ద సినిమాలు అన్నీ పోస్ట్ పోన్ అవ్వడంతో వాటి ప్లేస్ లో ఎంతో కొంత పెద్ద సినిమాగా అనిపించిన విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(Family Star Movie) మూవీ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా సినిమా ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది.
మొదటి రోజు నుండే కలెక్షన్స్ పరంగా పెద్దగా జోరు చూపించ లేక పోయిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఏదైనా అద్బుతం జరిగితే తప్పితే బిజినెస్ కి న్యాయం చేసే అవకాశం తక్కువగానే ఉండగా సినిమా కోసం ఓవరాల్ గా మేకర్స్ ఖర్చు చేసిన అమౌంట్ ఎంత వరకు ఉంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది..
సినిమా ఓవరాల్ గా బడ్జెట్ నిర్మాత అంచనాలను కూడా మించి పోయి లెక్క పెరిగిపోయింది అని ఇండస్ట్రీ లో టాక్ ఉంది. ముందు 60-70 కోట్ల రేంజ్ బడ్జెట్ తో అనుకున్న సినిమా పెరిగి పెరిగి ఆల్ మోస్ట్ 95-100 కోట్ల దాకా వెళ్ళింది అని టాలీవుడ్ లో స్ట్రాంగ్ బజ్ ఉంది…. సినిమా ఓవరాల్ గా షూటింగ్ ఫూటేజ్ కూడా…
ఎక్కువ లెంత్ తో రావడంతో టీం అదంతా ఎడిట్ చేయడంతో చాలా ఫూటేజ్ అండ్ బడ్జెట్ వేస్ట్ అయిందని అంటున్నారు, అలాగే రెమ్యునరేషన్స్ కి కూడా ఎక్కువ అమౌంట్ వెళ్ళింది అని సమాచారం. ఓవరాల్ గా ప్రమోషన్స్ ఖర్చులతో కలిపి సినిమా బడ్జెట్ 100 కోట్లకు పైగానే అయింది అని అంటూ ఉండగా…
నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది అంటూ ఉండగా ఆ లెక్కలు ఇంకా క్లియర్ గా రావాల్సి ఉండగా ఓవరాల్ గా ఓన్ రిలీజ్ ను పక్కకు పెడితే వాల్యూ బిజినెస్ రేంజ్ 30 కోట్లకు పైగానే జరిగిందని సమాచారం. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ అంచనాలను అందుకోలేక పోయింది, దాంతో బడ్జెట్ పరంగా చూసుకుంటే బాక్స్ ఆఫీస్ రిజల్ట్ మైండ్ బ్లాంక్ చేసేలా చేసింది అని అంటున్నారు ఇప్పుడు…