ప్రస్తుతం ఇండియాని ఒక ఊపు ఊపేస్తున్న సినిమాగా చిన్న సినిమానే అయినా కాంట్రవర్సీతో వస్తున్న సినిమాగా ఆడియన్స్ ముందుకు వస్తున్న లేటెస్ట్ మూవీ ది కేరళ స్టొరీ సినిమాను చెప్పుకోవాలి… లాస్ట్ ఇయర్ ది కాశ్మీర్ ఫైల్స్ రేంజ్ లో సంచలనం సృష్టించే అవకాశం ఉందీ అంటున్న ఈ సినిమా పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చర్చలు జరుగుతున్నాయి.
అంతలా ఇందులో ఏముంది అంటే ఈ సినిమా హిందూ మహిళలను ఒక పథకం ప్రకారం మతం మార్చుకునేలా చేసి ముస్లిం గా మార్చి తర్వాత ముస్లిం వ్యక్తీని పెళ్లి చేసుకుని తర్వాత వాళ్ళని ట్రాఫికింగ్ చేసి టెర్రర్ యాక్టివిటీ కోసం వాడుకుంటారు… తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా కథ…
ఇది రియల్ కథ అంటూ చెబుతున్నా కేరళ లో ఇలాంటివి జరిగాయి అని నిరూపిస్తే ఏకంగా కోటి రివార్డ్ ఇస్తామంటూ ఓపెన్ ఛాలెంజ్ లు కూడా చేస్తున్నారు. ఇంతటీ కాంట్రవర్సీని క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం మే 5న ఇండియా వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుండగా…
ఒక్క ట్రైలర్ తోనే సినిమా పై కావల్సినంత హైప్ వచ్చేసింది… ఇక ఆడియన్స్ లో కూడా మంచి క్యూరియాసిటీ ఏర్పడటంతో రిలీజ్ అయ్యాక సినిమా వలన చాలా రచ్చనే జరిగే అవకాశం ఉందని అంటూ ఉండగా మరో పక్క కలెక్షన్స్ పరంగా ది కాశ్మీర్ ఫైల్స్ రేంజ్ లో ఈ సినిమా రచ్చ చేయొచ్చని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.