Home గాసిప్స్ అప్పుడు 80…ఇప్పుడు 60…కి ఫిక్స్ చేస్తున్నారు!!

అప్పుడు 80…ఇప్పుడు 60…కి ఫిక్స్ చేస్తున్నారు!!

0

ఒక్కో సారి ఎంత ఫాస్ట్ గా సినిమాలు చేయాలి అనుకున్నా అప్పుడప్పుడు డిలే అనుకోకుండా అవుతూనే ఉంటుంది, ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ వలన చాలా సినిమా లు ఇలాంటి ఇబ్బందులనే పడుతుండగా మెగాస్టార్ చిరంజీవి 152 వ సినిమా ఆచార్య కూడా ఇలాంటి ఇబ్బందులనే పడుతుంది, మెగాస్టార్ ఒక ఆడియో లాంచ్ ఈవెంట్ లో ఈ సినిమా ను చాలా తక్కువ వర్కింగ్ డేస్ లో పూర్తీ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని చెప్పాడు.

కానీ షూట్ మొదలు అవ్వడానికే చాలా సమయం పట్టగా ఇక షూటింగ్ వేగం పుంజుకుంటుంది అనుకున్న టైం లో లాక్ డౌన్ అవ్వడం మూడు నెలలు గడిచి పోవడం తో అన్ని సినిమాలకు ఇబ్బంది కలిగినట్లే ఈ సినిమాకి కూడా డేట్స్ ఇబ్బంది కలుగుతుంది.

అదే సమయం లో ఇప్పటికే భారీ గా డిలే అవుతుండటం తో టీం అంతా కలిసి బడ్జెట్ ని రీవైజ్ చేసుకున్నారట. ముందు ఫారన్ లోకేషన్స్ ఇండియా లో వేరే చోట్ల షూటింగ్ లాంటివి భారీగా ప్లాన్ చేసుకోగా వేరే ఇండస్ట్రీ యాక్టర్స్ ని కూడా అప్రోచ్ అయ్యారు… ప్రస్తుతం వాటినన్నింటినీ రీవైజ్ చేసుకుని…

సినిమా ను హైదరాబాదు లోనే కొన్ని స్పెషల్ సెట్స్ వేసి ఇక్కడే షూట్ మొత్తం కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. దాంతో ముందు సినిమా కి 80 కోట్ల రేంజ్ బడ్జెట్ తో టోటల్ గా కంప్లీట్ చేయాలని అనుకున్నారట. ఇప్పుడు అన్నీ లెక్కలు రీవైజ్ చేసుకుంటే సినిమా టోటల్ బడ్జెట్ లెక్క 60 కోట్ల కి అటూ ఇటూ గా ఉండబోతుందని సమాచారం.

ఇదంతా మెగాస్టార్ రెమ్యునరేషన్ ని పక్కకు పెట్టాక టోటల్ బడ్జెట్ అని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది, మెగాస్టార్ రేంజ్ కి 60 కోట్ల రేంజ్ బడ్జెట్ అంటే 2 రోజుల్లో రికవరీ అవ్వడం ఖాయం. ఇక సినిమా లాక్ డౌన్ తర్వాత బాలెన్స్ 60% షూటింగ్ చక చకా కంప్లీట్ చేసి సంక్రాంతి బరిలో ఆచార్య ని నిలపాలని చూస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here