కల్కి సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని విజయాన్ని సొంతం చేసుకున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్(The Raja Saab Movie) మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు ఈ ఇయర్ ఎండ్ లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా…
ఇప్పటి వరకు సినిమా నుండి కొన్ని అప్ డేట్స్ తప్పితే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడానికి మెయిన్ అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేయబోతున్నారు…16న ఉదయం టైంలో ఆడియన్స్ ముందుకు రాబోతున్న సినిమా అఫీషియల్ టీసర్ మీద అందరిలో భారీ అంచనాలు ఉండగా…
టీసర్ యూట్యూబ్ లో రిలీజ్ అయ్యాక బ్రేక్ చేయాల్సిన రికార్డులు కొన్ని ఉన్నాయి. టాప్ స్టార్స్ నటించిన ఏ సినిమాలు వచ్చినా ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్, మొదటి 24 గంటల్లో ఎన్ని మిలియన్ వ్యూస్ అండ్ లైక్స్ ని సొంతం చేసుకున్నాయి అన్నది ముఖ్యంగా చూస్తూ ఉంటారు….
ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ విషయంలో RRR సినిమాలోని ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ 7 నిమిషాల్లో 1 లక్ష లైక్స్ ని అందుకోగా వకీల్ సాబ్ మరియు సలార్ సినిమాల టీసర్ లు 8 నిమిషాల్లో ఈ మార్క్ ని అందుకున్నాయి… ఇక 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న రికార్డ్…
ప్రభాస్ నటించిన రాదే శ్యామ్ సినిమా టీసర్ 42.67 మిలియన్ వ్యూస్ తో రికార్డ్ హోల్డర్ గా కొనసాగుతూ ఉండగా రెండో ప్లేస్ లో గేమ్ చేంజర్ టీసర్ 32.4 మిలియన్ వ్యూస్ తో టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఇక 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ ను సొంతం చేసుకున్న రికార్డ్…
RRR సినిమాలోని ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ 940.3 వేల లైక్స్ ని అందుకోగా రెండో ప్లేస్ లో పుష్ప1 టీసర్ 793K లైక్స్ మార్క్ తో నిలిచింది…ఇవి మెయిన్ గా టాలీవుడ్ తరుపున సినిమా టీసర్ బ్రేక్ చేయాల్సిన రికార్డులు…ఇక సింగిల్ ఛానెల్ లో ఇండియన్ మూవీస్ పరంగా…
హైయెస్ట్ వ్యూస్ రికార్డ్ ప్రభాస్ సలార్ సినిమా 83 మిలియన్ వ్యూస్ తో టాప్ లో ఉండగా లైక్స్ పరంగా 24 గంటల్లో కేజిఎఫ్ చాప్టర్2 టీసర్ 4.26 మిలియన్ లైక్స్ తో టాప్ లో నిలిచింది. ఇక ది రాజా సాబ్ సినిమా టీసర్ 24 గంటల్లో ఎలాంటి రికార్డులతో రచ్చ చేస్తుందో చూడాలి ఇక…