Home గాసిప్స్ ప్రభాస్ మూవీ కి పోటి అని బిల్డప్ ఇచ్చారు…ఇప్పుడు సాలిడ్ షాకిస్తున్నారు!!

ప్రభాస్ మూవీ కి పోటి అని బిల్డప్ ఇచ్చారు…ఇప్పుడు సాలిడ్ షాకిస్తున్నారు!!

3279
0

పాండమిక్ ఫస్ట్ వేవ్ తర్వాత కోలుకున్న టాలీవుడ్ ఇండస్ట్రీ వరుస పెట్టి సినిమాల రిలీజ్ డేట్స్ ని ఇయర్ ఎండ్ దాకా షెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే, ఒకటి తర్వాత ఒకటి పెద్ద చిన్న అన్న తేడా లేకుండా అన్ని సినిమాల రిలీజ్ డేట్స్ కన్ఫాం అవ్వగా ఇతర ఇండస్ట్రీలు కూడా పోటి కాకుండా గ్యాప్ లో సినిమాలను రిలీజ్ చేసుకునేలా ప్లాన్ చేసుకున్నాయి. కానీ బాలీవుడ్ వాళ్ళు మాత్రం… ఆల్ రెడీ కొన్ని పాన్ ఇండియా…

మూవీస్ రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేసినా అదే రోజున కానీ ఆ వీకెండ్ ని కానీ టార్గెట్ చేస్తూ కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేసి ఓపెన్ పోటి కి దిగారు. అలా దిగిన సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ రాధే శ్యామ్ సినిమా…

రిలీజ్ డేట్ అయిన జులై 30 న ఓ బాలీవుడ్ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. బాలీవుడ్ హీరోయిన్స్ లో ప్రజెంట్ నంబర్ 1 ఆలియా భట్ నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ గంగుభాయ్ ఖాతియా వాడి సినిమా ను కూడా జులై 30 న రిలీజ్ చేస్తున్నామని ఓ టీసర్ తో కన్ఫాం చేశారు.

దాంతో రాధే శ్యామ్ కి ఈ సినిమా పోటి అంటూ అన్ని చోట్లా సినిమా కి ఫుల్ పబ్లిసిటీ దక్కింది. ఇక ఇప్పుడు సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ మరింత తీవ్ర తరం కావడం తో బాలీవుడ్ ఆల్ రెడీ సినిమాల రిలీజ్ లు ఆపగా మరి కొన్ని నెలలు ఇలానే అక్కడ ఆగే ఉండే అవకాశం ఉన్న నేపధ్యంలో…

ఇప్పుడు గంగుభాయ్ ఖాతియా వాడి సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేయాలనీ చూస్తున్నారని తెలుస్తుంది, ఆల్ రెడీ రెండు లీడింగ్ OTT యాప్స్ సాలిడ్ రేటు ఆఫర్ చేయగా త్వరలోనే రేటు కన్ఫాం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దాంతో పోటి పోటి అని షాకివ్వడానికి టీం సిద్ధంగా ఉందని తెలుస్తుంది, సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన రాధే శ్యామ్ తో పాటు మరిన్ని సినిమాల రిలీజ్ డేట్స్ మారే అవకాశం ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here