Home గాసిప్స్ ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ 2 సినిమాలు రిలీజ్ చేయం అన్నారు…ఇప్పుడేమో ఇలా షాక్ ఇస్తున్నారు!

ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ 2 సినిమాలు రిలీజ్ చేయం అన్నారు…ఇప్పుడేమో ఇలా షాక్ ఇస్తున్నారు!

1070
0

కరోనా ఎఫెక్ట్ వలన పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి… రెండు మూడు నెలలు ఉండి పోతుంది అనుకున్న ఈ కరోనా ఎఫెక్ట్ అస్సలు తగ్గడం లేదు సరికదా ఇయర్ ఎండ్ కి కూడా పరిస్థితులు సెట్ అవుతాయో లేదో అన్న డౌట్ అందరి లోనూ నెలకొంది. ఇప్పటికే అనేక సినిమాలు ఈ ఏడాది థియేటర్స్ లో రిలీజ్ ఇక సాధ్య పడదు అని ఫిక్స్ అయ్యి డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి మొగ్గు చూపుతున్నాయి.

ముందు బాలీవుడ్ ఇది మొదలు పెట్టినా తర్వాత ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ లో మిగిలిన సినిమాలు కూడా పరిస్థితులను అర్ధం చేసుకుని ఇదే ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యాయి. ఇలాంటి టైం లో రీసెంట్ గా సినిమాలను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి అనౌన్స్ చేసిన టైం లో…

ఓ రెండు బాలీవుడ్ మూవీస్ మాత్రం ఇయర్ ఎండ్ రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ కూడా చేశాయి, పరిస్థితులు అప్పుడు సెట్ అయితే ఒకటి దీపావళికి ఒకటి క్రిస్టమస్ కి రిలీజ్ చేస్తామని చెప్పాయి. ఆ సినిమాలే అక్షయ్ కుమార్ సూర్యవంశీ మరోటి రణవీర్ సింగ్ 83 వరల్డ్ కప్ మూవీ.

కానీ ఇప్పుడు ఇయర్ ఎండ్ కి కూడా పరిస్థితులు ఏమాత్రం సెట్ అయ్యేలా కనిపించడం లేదు, దాంతో రెండు సినిమాల కో ప్రొడ్యూసర్ అయిన రిలయన్స్ వాళ్ళు ఇప్పుడు ఇయర్ ఎండ్ కి పరిస్థితులు సెట్ అయ్యేల లేవు కాబట్టి ఈ సినిమాలను కూడా మంచి ఆఫర్స్ వస్తే డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయడనికి సిద్ధం చేస్తున్నాం అంటూ రీసెంట్ గా…

ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారట. దాంతో ఎట్టి పరిస్థితులలో కూడా థియేటర్స్ లోనే రిలీజ్ అనుకున్న ఈ రెండు క్రేజీ సినిమా లు కూడా ప్రస్తుత పరిస్థితులకు తలొగ్గి డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కాబోతున్నయన్న మాట. ఇక బెటర్ ఆఫర్ ఎవరు ఈ సినిమాలకు ఇస్తారో అన్న రేసు మొదలు కాబోతుంది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here