నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఏ రేంజ్ లో జోరు చూపుతూ బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుందో అందరికీ తెలిసిందే. ఇదే టైం లో సినిమా కి మన దగ్గరే కాదు ఇతర చోట్ల కూడా ప్రశంసలు ఓ రేంజ్ లో సొంతం అయ్యాయి. దానికి కారణం సినిమా సెకెండ్ ఆఫ్ లో…
బాలయ్య అఖండ క్యారెక్టర్ దేవాలయాల విశిష్టత, గొప్పతనం, అవసరం ఇలా అన్నీ డైలాగ్స్ చాలా బాగా ఉండటంతో అవి ఇతర రాష్ట్రాల ఆడియన్స్ కి కూడా చాలా బాగా రీచ్ ని సొంతం చేసుకున్నాయి. దాంతో సినిమా కి ఇతర భాషల్లో కూడా క్రేజ్ ఏర్పడగా…
హిందీ లో సినిమా పై మరింత ఎక్కువ క్రేజ్ ఏర్పడింది అని చెప్పాలి. సినిమా సబ్ టైటిల్స్ తోనే అక్కడ ఎక్కువ మంది ఎగబడి చూశారు థియేటర్స్. హిందీ లో డబ్ చేసి కొన్ని థియేటర్స్ లో అయినా రిలీజ్ చేయండి, మేం చూస్తాం అంటూ ఎన్నో కామెంట్స్ మేకర్స్ కి వెళ్ళాయి.
ఇక హిందీ డబ్బింగ్ కి కూడా రేటు అమాంతం పెరిగి పోయిందని సమాచారం. సినిమా ను రిలీజ్ కి ముందు 15 కోట్ల రేంజ్ రేటుకి హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్ముడు పోయినట్లు వార్తలు వచ్చాయి కానీ అవేవి నిజం కాదని సినిమా రిలీజ్ అయ్యాక కన్ఫాం అయ్యింది. హిందీ డబ్బింగ్ రేటు ఆఫర్ చేశేరాని కానీ మేం డీల్ అప్పుడు…
ఓకే చేయలేదని, కానీ ఇప్పుడు ఏకంగా 20 కోట్ల రేంజ్ రేటుని సినిమా సొంతం చేసుకుందని అంటున్నారు.. 15 కోట్లు అనుకుంటే ఇప్పుడు ఏకంగా 20 కోట్ల రేంజ్ రేటు అంటే మాత్రం ఇది మెంటల్ మాస్ రేటు అనే చెప్పాలి. ఈ రేంజ్ రేటు టాప్ స్టార్ మూవీస్ కి మాత్రమే సొంతం అవుతూ ఉంటాయి కానీ ఇప్పుడు ఈ సినిమా కి సొంతం అవ్వడం విశేషం.