Home Uncategorized తిమ్మరుసు-ఇష్క్ 4 డేస్ కలెక్షన్స్…వర్కింగ్ డే టేస్ట్ రిజల్ట్ ఇదే!

తిమ్మరుసు-ఇష్క్ 4 డేస్ కలెక్షన్స్…వర్కింగ్ డే టేస్ట్ రిజల్ట్ ఇదే!

2624
0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా సెకెండ్ పాండమిక్ తర్వాత రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీస్ తిమ్మరుసు మరియు ఇష్క్ సినిమాలు రెండూ ఇప్పుడు ఫస్ట్ వీకెండ్ ని కంప్లీట్ చేసు కుని వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయ్యాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో తిమ్మరుసు ఓవరాల్ గా బాగానే హోల్డ్ చేసినప్పటికీ కూడా ఇష్క్ సిన్నిమా మాత్రం హోల్డ్ చేయ లేక చేతులు ఎత్తేసింది అని చెప్పాలి…

తిమ్మరుసు సినిమా వీకెండ్ మొత్తం మీద 1.17 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకోగా ఇష్క్ సినిమా వీకెండ్ అయ్యే సరికి 58 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక వీకెండ్ తర్వాత వర్కింగ్ డే టేస్ట్ లో తిమ్మరుసు సినిమా మొదటి రోజు కన్నా బెటర్ కలెక్షన్స్ ని…

బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. సినిమా మొత్తం మీద 22 లక్షల షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ షేర్ 25 లక్షల దాకా సొంతం అయింది. ఇక ఇష్క్ సినిమా 4 వ రోజున భారీగా క్రాష్ అయ్యి 8 లక్షల షేర్ ని తెలుగు రాష్ట్రాలలో 9 లక్షల షేర్ ని వరల్డ్ వైడ్ గా…

సొంతం చేసుకుంది. దాంతో మొత్తం మీద తిమ్మరుసు 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 1.16 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 1.42 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. ఇష్క్ మూవీ 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 55 లక్షల షేర్ ని వరల్డ్ వైడ్ గా 67 లక్షల షేర్ ని సాధించింది. తిమ్మరుసు బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2.6 కోట్లకి ఇంకా…

1.18 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇష్క్ సినిమా 2.7 కోట్ల టార్గెట్ కి ఇంకా 2.13 కోట్ల షేర్ ని ఇంకా సాధించాల్సి ఉంటుంది. ఇష్క్ సినిమా ఇక డౌటే కానీ తిమ్మరుసు ఇలానే హోల్డ్ చేస్తూ సెకెండ్ వీకెండ్ దాకా వెళితే బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here