చిన్న చిన్న సైడ్ రోల్స్ నుండి క్యారెక్టర్ రోల్స్ కి… ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ నుండి మెయిన్ లీడ్ హీరోగా వరుస పెట్టి అవకాశాలతో దూసుకు పోతున్న సత్యదేవ్ ఎలాంటి స్టార్ బ్యాగ్రాప్ లేకున్నా తన టాలెంట్ తో వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్నాడు. లాస్ట్ ఇయర్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా తర్వాత వరుస పెట్టి అవకాశాలను సొంతం చేసుకున్న సత్యదేవ్ నటించిన సినిమాల్లో తిమ్మరుసు సినిమా ముందుగా…
ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా డైరెక్ట్ రిలీజ్ కోసం సాలిడ్ ఆఫర్స్ నే సొంతం చేసుకుంది… బడ్జెట్ కి డబుల్ రేంజ్ అనిపించేలా 7 కోట్ల రేంజ్ దాకా డైరెక్ట్ రిలీజ్ కోసం ఆఫర్స్ వచ్చినప్పటికీ కూడా అవన్నింటికీ నో చెప్పిన మూవీ టీం…
సినిమాను సెకెండ్ పాండమిక్ తర్వాత థియేటర్స్ లో ఫస్ట్ రిలీజ్ గా ఆడియన్స్ ముందుకు తీసుకు రావాలని డిసైడ్ అవ్వగా సినిమా కి ఓవరాల్ గా జరిగిన బిజినెస్ వివరాలు ట్రేడ్ లో ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ఆ లెక్కల ప్రకారం సినిమా ఓవరాల్ బిజినెస్ లెక్క ఈ విధంగా ఉంది..
నైజాం లో ఈ సినిమాకి 1.2 కోట్ల దాకా బిజినెస్ జరగగా, టోటల్ ఆంధ్రలో 1.1 కోటి బిజినెస్ జరిగింది, ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ లో కలిపి మరో 10 లక్షల బిజినెస్ జరిగింది. టోటల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ 2.4 కోట్ల దాకా జరిగింది.. ఈ బిజినెస్ లో కూడా మినిమం గ్యారెంటీ, షేర్ గ్యారెంటీ, ఓన్ రిలీజ్ ఇలా చాలా బిజినెస్ మాడల్స్ కలిసి…
సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇక సినిమా ఈ బిజినెస్ లెక్కల ప్రకారం బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమం 2.6 కోట్ల దాకా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది… సెకెండ్ పాండమిక్ తర్వాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీస్ లో ఉన్న సినిమా కాబట్టి ఆడియన్స్ ఎంతవరకు అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి వస్తారో చూడాలి ఇక.