ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమాలు ఎక్కువగా ఫ్యామిలీ ఫ్రెండ్లీగా ఉంటూ వస్తాయి, అల్లు అర్జున్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్నింటిలో కూడా హీరోయిన్స్ తో మరీ ఓవర్ రొమాన్స్ ఎప్పుడూ చేయలేదు అనే చెప్పాలి, అలాగే సినిమా కంటెంట్ ఫ్యామిలీస్ కి నచ్చేలా ప్లాన్ చేసుకోవడం వలెనే ఫ్యామిలీ ఆడియన్స్ లో అల్లు అర్జున్ కి ఎక్స్ లెంట్ ఫాలోయింగ్ ఉంటుంది… సినిమాలకు టాక్ ఎలా ఉన్నప్పటికీ కూడా…
లాంగ్ రన్ లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రప్పించే సత్తా ఉన్న హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు… అలాంటి అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప ఇప్పటి వరకు అల్లు అర్జున్ చేసిన సినిమాలు అన్నింటిలోకీ కంప్లీట్ మాస్ రగ్గుడ్ రోల్ అని చెప్పాలి.
ఆ రగ్గుడ్ క్యారెక్టర్ కి తగ్గట్లే సినిమాలో మాస్ ఎలిమెంట్స్ అలాగే సమంత ఐటెం సాంగ్ కూడా హాట్ గానే ప్లాన్ చేశారు. కానీ హీరోయిన్ తో మరీ గ్లామర్ షో అయితే లేకుండా ప్లాన్ చేశారు, దాంతో ఫ్యామిలీ ఆడియన్స్ చాలా వరకు ఇబ్బంది పడకుండానే సినిమా చూస్తున్నారు కానీ…
సమంత సాంగ్ వాళ్ళని కొంచం ఇబ్బంది పెట్టినా కానీ సినిమాలో ఒకానొక సన్నివేశం మట్టుకు అంతకన్నా ఎక్కువ అన్ కంఫర్ట్ గా అనిపించింది….. సెకెండ్ ఆఫ్ లో లో హీరోయిన్ తో అల్లు అర్జున్ తన వాన్ లో చెప్పిన డైలాగ్స్ కానీ తెరపై వచ్చిన సీన్స్ కానీ ఆడియన్స్ కి ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి థియేటర్స్ లో చాలా అన్ కంఫర్ట్ అయ్యేలా చేశాయి.
పెద్దగా సినిమాకి యూస్ అవ్వని ఆ సీన్ ఎడిటింగ్ లోనే కట్ అవ్వాల్సింది కానీ మిస్ అయింది, కానీ ఫస్ట్ డే సినిమా చూసిన వాళ్ళ ఫీడ్ బ్యాక్ లో ఈ సీన్ గురించి ఉండటంతో ఇప్పుడు రెండో రోజు ఆ సీన్ ని డిలేట్ చేసి మూడో రోజు నుండి ఆ సీన్ లేకుండా చూసుకోబోతున్నారట. సో ఫ్యామిలీ ఆడియన్స్ ఇక థియేటర్స్ కి వస్తే పెద్దగా అన్ కంఫర్ట్ అవ్వరనే చెప్పొచ్చు.