కరోనా ఎఫెక్ట్ తో ఇండియా లో థియేటర్స్ మూతబడి ఆల్ మోస్ట్ 100 రోజులకు పైగానే అవుతుంది. ఎప్పుడు తెరచుకుంటాయి అన్నది కూడా ఎవ్వరి కీ క్లారిటీ లేని పరిస్థితి. పరిస్థితులు కూడా ఏమాత్రం చక్కదిద్దుకోవడం లేదు. ఇలాంటి టైం లో మరో రెండు మూడు నెలల టైం మినిమం పడే అవకాశం ఇంకా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇదే సమయం లో కొన్ని చోట్ల మాత్రం థియేటర్స్ మళ్ళీ తెర్చుకుంటున్నాయి.
ఇప్పటికే అమెరికా లో కొన్ని చోట్ల థియేటర్స్ ఓపెన్ అవ్వగా… దుబాయ్ లో కంప్లీట్ గా థియేటర్స్ తెరచుకున్నాయి. ఇక ఫ్రాన్స్ అండ్ కొన్ని యూరప్ దేశాలు కూడా థియేటర్స్ ని మళ్ళీ తెరవగా… రీసెంట్ గా న్యూజిలాండ్ కరోనా ఫ్రీ కంట్రీగా మారిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా కరోనా నుండి కోలుకుని ఇప్పుడు థియేటర్స్ ని రీ ఓపెన్ చేసినట్లు సమాచారం. హాలివుడ్ మూవీస్ తో పాటు ఇండియన్ మూవీస్ తో కూడా అక్కడ థియేటర్స్ ని రీ ఓపెన్ చేస్తుండగా 2018 ఇయర్ ఎండ్ లో వచ్చిన ఎన్టీఆర్ టెంపర్ హిందీ రీమేక్…
సింబా సినిమా తో గ్రాండ్ గా థియేటర్స్ ని రీ ఓపెన్ చేయబోతున్నట్లు సమాచారం. అది కూడా భారీ లెవల్ లో రీ రిలీజ్ చేస్తుండటం విశేషం. ఈ సినిమా ఈ ఒక్క చోటే కాకుండా… ఫిజి దేశం లో కూడా మళ్ళీ రీ రిలీజ్ కాబోతుందట. త్వరలోనే మరిన్ని సినిమాలను ఆక్కడ రీ రిలీజ్ చేబోతున్నట్లు వాళ్ళు అనౌన్స్ చేశారు.
ఇక మన ఇండియా లో మాత్రం పరిస్థితి ఎప్పటికి సద్దుకుంటుంది, థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయి, కొత్త సినిమా లు ఎప్పుడు రిలీజ్ అవుతాయి లాంటివి ప్రస్తుతానికి ఇంకా సస్పెన్స్ తోనే కూడుకుని ఉన్నాయని చెప్పాలి. పరిస్థితి మరో 2 మూడు నెలలు టైం తీసుకున్నా అన్నీ సద్దుకుంటే అదే చాలు అని అంతా కోరుకుంటున్నారు…