Home న్యూస్ 2018 ఇండస్ట్రీ రికార్డ్ బ్రేక్ చేసిన తుడరుం…ఎపిక్ మాస్!

2018 ఇండస్ట్రీ రికార్డ్ బ్రేక్ చేసిన తుడరుం…ఎపిక్ మాస్!

0

మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే చిన్న ఇండస్ట్రీగా పేరున్న మలయాళ ఇండస్ట్రీకి స్ట్రాంగ్ ఓవర్సీస్ మార్కెట్ ఉంది…గల్ఫ్ కంట్రీస్, మిగిలిన చోట్ల ఇతర సౌత్ మూవీస్ తో పోల్చితే మంచి మార్కెట్ ఉన్న మలయాళ ఇండస్ట్రీకి కేరళ స్టేట్ మరీ అంత పెద్ద మార్కెట్ కాక పోయినా కూడా కొన్ని సినిమాలు కేరళ స్టేట్ లో కూడా…

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకున్నాయి. అందులో రెండేళ్ళ క్రితం వచ్చిన 2018 మూవీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి సంచలనం సృష్టించగా…కేరళ స్టేట్ లో ఈ సినిమా 89.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని కేరళ స్టేట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

తర్వాత మంజుమ్మేల్ బాయ్స్ వరల్డ్ వైడ్ గా రికార్డులు క్రియేట్ చేసినా కూడా కేరళ స్టేట్ లో ఈ సినిమా రికార్డ్ ను మాత్రం అందుకోలేదు. ఇక ఈ ఇయర్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్2 మూవీ వరల్డ్ వైడ్ గా మంజుమ్మేల్ బాయ్స్ ఇండస్ట్రీ రికార్డ్ ను బ్రేక్ చేసినా కూడా..

Mohan Lal Thudarum 2 Weeks(14 Days) Total WW Collections!!

కేరళలో మాత్రం చాలా క్లోజ్ గా వచ్చి ఇండస్ట్రీ రికార్డ్ ను మిస్ చేసుకుంది. కానీ నెల గ్యాప్ లో మళ్ళీ మోహన్ లాల్(Mohan Lal) నటించిన సెన్సేషనల్ మూవీ తుడరుం(Thudarum Movie) సినిమా ఊహకందని కలెక్షన్స్ తో అన్ని చోట్లా మాస్ రచ్చ చేయగా…

కేరళలో ఇప్పుడు సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఏకంగా ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసింది. 2018 మూవీ టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని 16 రోజుల్లో బ్రేక్ చేసి తుడరుం సినిమా ఇప్పుడు కేరళ స్టేట్ న్యూ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి మాస్ రచ్చ చేసింది…

ఇప్పటికీ ఎపిక్ రన్ ను కొనసాగిస్తున్న సినిమా ఇప్పుడు కేరళ స్టేట్ లో మొట్ట మొదటి సారిగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోబోతున్న మొట్ట మొదటి సినిమాగా సంచలన రికార్డ్ ను నమోదు చేయబోతుంది. ఈ రికార్డ్ ఇప్పట్లో కేరళలో బ్రేక్ అవ్వడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండటం విశేషం…

Mohan Lal Thudarum 11 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here