బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సమ్మర్ లో మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన ఎంపురాన్ మూవీ మిక్సుడ్ టాక్ తో కూడా సంచలన విజయాన్ని అందుకోగా ఆ సినిమా వచ్చిన నెల లోపే ఇప్పుడు తుడరుం(Thudaram Telugu Movie) తో ఆడియన్స్ ముందుకు రాగా….
తెలుగులో రిలీజ్ అయిన సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే…సినిమాల్లో యాక్షన్ సీన్స్ లో డూప్ గా నటించే హీరో ఒక టైం తర్వాత పనులన్నీ ఆపేసి ఊర్లో సెటిల్ అవుతాడు…అనుకోకుండా…
తన కార్ దొంగతనం అవుతుంది, అలాగే తన కొడుకు కూడా కనిపించకుండా పోతాడు…దాంతో హీరో ఏం చేశాడు…ఈ సమస్యలను ఎలా సాల్వ్ చేశాడు అన్నది స్టోరీ పాయింట్…కథ పాయింట్ కొంచం దృశ్యం సినిమాను పోలినట్లు అనిపించినా కూడా మరోసారి మోహన్ లాల్…
తనదైన స్టైల్ లో నటించి కంప్లీట్ యాక్టర్ అని తనకి ఉన్న కితాబుని మరోసారి రుజువు చేసుకున్నాడు. దృశ్యం లో ఎక్కడా మాస్ సీన్స్ లేవు కానీ ఈ సినిమాలో అటు దృశ్యం రేంజ్ స్క్రీన్ ప్లే తో పాటు యాక్షన్ పార్ట్ కూడా సాలిడ్ గానే ఎలివేట్ చేసేలా ఉన్నాయి అని చెప్పాలి…
సినిమా కొంచం అక్కడక్కడా డ్రాగ్ అయినట్లు అనిపించినా, దృశ్యం పోలికలు కనిపించినా కూడా చాలా వరకు సినిమా పెద్దగా బోర్ ఫీల్ అవ్వకుండా కొన్ని చోట్ల మంచి థ్రిల్ ని కూడా కలిగిస్తూ సాగి థియేట్రికల్ గా మంచి ఎక్స్ పీరియన్స్ ను కలిగించేలా చేసింది అని చెప్పాలి.
సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ కి తగ్గట్లు మెప్పించగా తెలుగులో సైలెంట్ గా రిలీజ్ చేయకుండా కొంచం మంచి ప్రమోషన్స్ లాంటివి చేసి రిలీజ్ చేసి ఉంటే ఇంకా బెటర్ రీచ్ ను సొంతం చేసుకుని ఉండేది. ఓవరాల్ గా సినిమా మీద పెద్దగా అంచనాలు ఏమి…
పెట్టుకోకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ కి అనుకోకుండా మంచి ఎక్స్ పీరియన్స్ నే ఇచ్చేలా మెప్పించింది సినిమా….సినిమాలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా మోహన్ లాల్ రీసెంట్ మూవీస్ లో బెస్ట్ మూవీ అని చెప్పాలి…ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 3 స్టార్స్….