బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ రిలీజ్ అయిన 30 రోజుల తర్వాత కూడా మంచి లాభాలనే సొంతం చేసుకుంటూ కలెక్షన్స్ పరంగా దూసుకు పోతున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ తుడరుం(Thudarum Movie) సెన్సేషనల్ రన్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చేసింది..
అయినా కూడా కేరళలో మంచి హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతున్న ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తూ ఉండగా లాభాలను మరింతగా పెంచుకుంటూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం… మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా…
46 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఇప్పటి వరకు ఊహకందని లాభాలను సొంతం చేసుకుంది. మలయాళ ఇండస్ట్రీ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ లో కూడా ఒకటిగా చేరింది.
మొత్తం మీద 33 డేస్ కంప్లీట్ అయ్యే టైంకి సినిమా 233 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని దాటేసిన సినిమా ఆల్ మోస్ట్ 114.5 కోట్ల లోపు షేర్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది….దాంతో ఆల్ మోస్ట్ 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఓవరాల్ గా ఇప్పటి వరకు…
సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 68.50 కోట్ల రేంజ్ లో మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని మలయాళ ఇండస్ట్రీ తరుపున మంజుమ్మేల్ బాయ్స్ 80 కోట్ల ప్రాఫిట్ తర్వాత సెకెండ్ బిగ్గెస్ట్ ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా గా నిలిచింది… రిలీజ్ కి ముందు మరీ అనుకున్న రేంజ్ లో అంచనాలు లేని సినిమాతో మోహన్ లాల్ మాస్ వీరంగం సృష్టించాడు బాక్స్ ఆఫీస్ దగ్గర…