బాక్స్ ఆఫీస్ దగ్గర అనేక ఫ్లాఫ్ మూవీస్ ఎప్పటి కప్పుడు ఒకటి కి మించి ఒకటి నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుని ఉండొచ్చు, కానీ ఆ సినిమాలకు బుక్ మై షో లో యావరేజ్ యూసర్ రేటింగ్ ఎంతో కొంత పర్వాలేదు అనిపించేలా ఉంటూ వస్తుంది. కానీ ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan)…
శింబు(Simbhu)తో కలిసి మని రత్నం(Mani Rathnam) డైరెక్షన్ లో చేసిన లేటెస్ట్ మూవీ తగ్ లైఫ్(Thug Life Movie) మాత్రం మరో లెవల్ లో మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకుందని సినిమా యూసర్ రేటింగ్ చూస్తె తెలుస్తుంది..
రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆటకే అట్టర్ డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది…అది ఆన్ లైన్ వరకే అని అందరూ అనుకున్నా కూడా ఆఫ్ లైన్ లో కూడా ఓ రేంజ్ లో టాక్ స్ప్రెడ్ అయిపొయింది. దాంతో ఆ ఇంపాక్ట్ సినిమా బుక్ మై షో లో…
యూసర్ రేటింగ్ మీద పడగా రీసెంట్ టైంలోనే లోవేస్ట్ రేటింగ్ ను సొంతం చేసుకున్న బిగ్ నోటబుల్ మూవీ గా తగ్ లైఫ్ సినిమా నిలిచింది అని చెప్పాలి. సినిమా కి బుక్ మై షో లో యావరేజ్ గా కేవలం 10 రేటింగ్ పాయింట్స్ కి గాను 5.2 రేటింగ్ పాయింట్స్ మాత్రమే సొంతం అయ్యాయి…
ఇది వరకు కమల్ హాసన్ చేసిన ఇండియన్2 కూడా ఇలానే లో రేటింగ్ ను సొంతం చేసుకున్నా కూడా ఆ సినిమాను సైతం మించి పోయే రేంజ్ లో ఇప్పుడు తగ్ లైఫ్ సినిమా లో రేటింగ్ ను దక్కించుకుంది. ఈ ఇంపాక్ట్ సినిమా టికెట్ సేల్స్ పై కూడా పడే అవకాశం ఎంతైనా ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ కి ఇది గట్టి ఎదురుదెబ్బగా నిలిచే అవకాశం ఎంతైనా ఉంది.