లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) మణిరత్నం కాంబోలో 38 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా తగ్ లైఫ్(Thug Life Movie) భారీ అంచనాల నడుమ ఈ గురువారం గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద తమిళ్ లో మంచి అంచనాలు ఉన్నాయి…తెలుగు లో ట్రైలర్ పర్వాలేదు అనిపించే రేంజ్ లో..
బజ్ ని క్రియేట్ చేసినా కూడా ఇక్కడ చాలా వరకు సినిమా మౌత్ టాక్ నే నమ్ముకుని ఇప్పుడు రిలీజ్ కాబోతుంది అని చెప్పాలి. టాక్ బాగుంటే ఇక్కడ ఓపెనింగ్స్ కూడా కుమ్మేసే అవకాశం ఉండగా ఇక సినిమా తమిళ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ను రీసెంట్ గా ఓపెన్ చేయగా…
అక్కడ సాలిడ్ బుకింగ్స్ తో జోరు చూపెడుతూ దూసుకు పోతున్న తగ్ లైఫ్ సినిమా ఓపెనింగ్స్ పరంగా అక్కడ మంచి జోరు ని చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ప్రజెంట్ టైం కి ఓవరాల్ గా అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 4.5-5 కోట్ల రేంజ్ లో ఉండగా…
రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 1 కోటి రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఓవర్సీస్ లో కూడా పర్వాలేదు అనిపించే రేంజ్ లో బుకింగ్స్ ఉండగా సినిమా మౌత్ టాక్ ఏమాత్రం పాజిటివ్ గా ఉన్నా కూడా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఈ సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మూడేళ్ళ క్రితం విక్రమ్ సినిమాతో కెరీర్ లో ఎపిక్ కంబ్యాక్ అండ్ ఊరమాస్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న కమల్ హాసన్ తర్వాత రిలీజ్ చేసిన ఇండియన్2 మూవీతో అంచనాలను అందుకోలేక పోయాడు…
మరో పక్క పోన్నియన్ సెల్వన్ 2 పార్ట్స్ తో మణిరత్నం మంచి ఫామ్ లో ఉండటంతో కమల్ అండ్ మణిరత్నం ల కాంబోలో ఆల్ మోస్ట్ 38 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా అవ్వడంతో మినిమమ్ గ్యారెంటీ మూవీ అనిపించే రేంజ్ లో హైప్ తో వస్తున్న తగ్ లైఫ్ తో కమల్ హసన్ ఏ రేంజ్ లో కంబ్యాక్ ను అందుకుంటాడో చూడాలి.