బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) శింబు(Simbhu)తో కలిసి మని రత్నం(Mani Rathnam) డైరెక్షన్ లో చేసిన లేటెస్ట్ మూవీ తగ్ లైఫ్(Thug Life Movie) మీద డీసెంట్ అంచనాలు ఉండగా సినిమా వరల్డ్ వైడ్ గా…
210 కోట్ల రేంజ్ లో గ్రాస్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ను రీసెంట్ గా ఓపెన్ చేయగా ఓవరాల్ గా బుకింగ్స్ ట్రెండ్ రీసెంట్ గా తమిళ్ లో రిలీజ్ అయిన సూర్య(Suriya) రెట్రో మూవీ(Retro Movie) రేంజ్ లో ఉన్నాయని చెప్పాలి…
కానీ ఈ సినిమా కర్ణాటకలో రిలీజ్ అవ్వడం లేదు, అలాగే రెట్రో తో కంపేర్ చేస్తే ఓవర్సీస్ లో తగ్ లైఫ్ బుకింగ్స్ ట్రెండ్ చాలా బెటర్ గా ఉంది. ఓవరాల్ గా తెలుగు లో ఇప్పటి వరకు 1.3 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను అందుకున్న సినిమా తమిళ్ లో 7 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో..
మరో 1.5 కోట్లు గ్రాస్ బుకింగ్స్ ను సాధించింది, ఇక ఓవర్సీస్ లో 1.2 మిలియన్ డాలర్స్ రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను అందుకోగా ఓవరాల్ గా ప్రీ బుకింగ్స్ వరల్డ్ వైడ్ గ్రాస్ 19-20 కోట్ల రేంజ్ లో ఉండగా మొదటి రోజు సినిమాకి టాక్ బాగుంటే…కర్ణాటకలో రిలీజ్ లేక పోవడంతో…
మిగిలిన వరల్డ్ వైడ్ గా అటూ ఇటూగా 35-40 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది, సినిమాకి వచ్చే టాక్ ను బట్టి కలెక్షన్స్ ఓపెనింగ్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. ఓవరాల్ గా టాక్ ను బట్టి సినిమా ఏ రేంజ్ లో జోరు చూపెడుతుంది అన్నది డిసైడ్ కానుంది.