సినిమాలకు వచ్చే టాక్ ఆ సినిమాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పై ఓ రేంజ్ లో ఇంపాక్ట్ ను చూపించడం అన్నది కామన్ గా జరుగుతూ ఉంటుంది…లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన కమల్ హాసన్ (Kamal Haasan)…శింబు(Simbhu) కాంబోలో(Mani Rathnam) డైరెక్షన్ లో వచ్చిన తగ్ లైఫ్(Thug Life Movie) మూవీ రీసెంట్ గా రాగా…
మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా వీకెండ్ లో ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేదు…వర్కింగ్ డేస్ లో హోల్డ్ మినిమమ్ కూడా కనిపించడం లేదు ఇప్పుడు. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రిజల్ట్ ఏ రేంజ్ లో ఉండబోతుందో…
ఆల్ రెడీ అందరికీ అర్ధం అయిపొయింది…దాంతో మేకర్స్ ఇప్పుడు సినిమా డిజిటల్ రిలీజ్ విషయంలో త్వరగా డిజిటల్ రిలీజ్ చేసి కొంత ఎక్కువ మొత్తాన్ని ఓటిటి వాళ్ళ దగ్గర నుండి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట…సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ వాళ్ళు…
మంచి ఫ్యాన్సీ రేటు చెల్లించి సొంతం చేసుకున్నారు…సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యాక 8 వారాల టైంకి డిజిటల్ లో రిలీజ్ చేయాలని అగ్రిమెంట్ జరుపుకున్నారట… కానీ ఇప్పుడు సినిమా అన్ని వారాల రన్ ను సొంతం చేసుకునే అవకాశమే లేక పోవడంతో…
నాలుగు వారాల్లో సినిమా డిజిటల్ లో రిలీజ్ చేస్తే ఎంత ఎక్కువ అమౌంట్ ఇస్తారు అంటూ నెట్ ఫ్లిక్స్ వాళ్ళతో బేరాలు మొదలు పెట్టారని సమాచారం. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ను చూసిన నెట్ ఫ్లిక్స్ వాళ్ళు మేకర్స్ అనుకున్న రేంజ్ లో రేటు ఇవ్వడం కష్టమే అని అంటున్నారు…
కానీ ఎర్లీ రిలీజ్ కి కొంచం రేటు అయితే పెరిగే అవకాశం ఉండటంతో ఎంతైతే అంత కలిసి వస్తుంది అన్న ఆలోచనలో టీం ఎర్లీ ఓటిటి రిలీజ్ కి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాకి ఏ రేంజ్ లో లాసులు కన్ఫాం అవుతాయో చూడాలి ఇప్పుడు.